సరిపడా సిబ్బంది లేకనే..
పదోన్నతిపై వరంగల్‌లో విధులు నిర్వర్తిస్తున్నా. జిల్లాలో పర్యవేక్షణ ఇబ్బంది అవుతుంది. ఇక్కడి కార్యాలయం టైపిస్టు, అటెండర్‌తో మాత్రమే నడుస్తోంది. క్షేత్రస్థాయిలో పర్యటించే సిబ్బంది ఎవరూ లేరు. అందరు అధికారులు ఉంటేనే అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేయగలం. సమస్య తీవ్రతను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తాం.
– గోవిందరాజు, జిల్లా మైనింగ్‌శాఖ అధికారి
వనపర్తి: జిల్లాలో మట్టి అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట పడటం లేదు. అక్రమార్కులు పట్టణ, గ్రామీణ ప్రాంతాలనే తేడా లేకుండా ప్రైవేట్ అవసరాలు, వెంచర్లు, ఇతర నిర్మాణాలకు ఇష్టానుసారంగా గుట్టలను తవ్వి మట్టి విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఫిర్యాదు చేసేందుకు, ప్రశ్నించేందుకు యత్నించిన వారిపై ఎదురుదాడికి తెగబడుతున్నట్లు అధికారులకు ఫిర్యాదులు అందాయి. ఇటీవలి కాలం వరకు పట్టణంలోని శ్రీనివాసపురం శివారు, పాన్‌గల్ రోడ్డులోని గుట్టల్లో తవ్వకాలు జరిగాయి. తాజాగా పది రోజుల నుంచి రాజపేట శివారులో ఎలాంటి అనుమతి లేకుండానే గుట్టలను తవ్వేసి మట్టిని కొత్తకోట శివారులోని ఓ ప్రైవేట్ స్థలానికి తరలిస్తూ సొమ్ము చేసుకోవడం అధికారుల కంట పడినా.. ఎవరైనా ఫిర్యాదు చేస్తేనే స్పందించేలా ప్రవర్తించడం గమనార్హం. అనుమతులు, నిబంధనల పర్యవేక్షణ మాట ఎలా ఉన్నా.. మట్టి తవ్వకాలు, తరలింపుపై అధికారుల నిఘా ఎక్కడుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ వ్యవహారంలో రూ.లక్షల్లో అక్రమార్జన జరుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తుండగా, అక్రమ తవ్వకాలతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గడిపడుతుందనేది సత్యం.
శ్రీనివాసపురం శివారులో మట్టి తవ్వకాల వ్యవహారం చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ప్రభుత్వానికి నామమాత్రంగా చలానా చెల్లించి గుట్టలను మాయం చేశారనేది బహిరంగ సత్యం. ఇటీవల రాజాపేట శివారులోనూ తవ్వకాలు జరుగుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు చక్కర్లు కొట్టడంతో విషయం వెలుగులోకి వచ్చిందని చెప్పవచ్చు. తవ్వకాల స్థలాలు, తరలిస్తున్న మట్టి పరిమాణం, వినియోగిస్తున్న వాహనాలు, అనుమతుల వివరాలను పరిశీలిస్తేనే అసలు పరిస్థితి అంచనా వేయవచ్చు. ఇసు క దందాను పక్కనబెట్టి అధికార పార్టీకి చెందిన కొందరు బడా నాయకులు సైతం మట్టి దందాకు తెరితీసినట్లు విమర్శలు గుప్పుమంటున్నాయి.
ప్రాంతాలు మారుస్తూ..
శ్రీనివాసపురం, రాజపేట శివారుల్లో జోరుగా అక్రమ తవ్వకాలు
రూ.లక్షల్లో అక్రమార్జన..ప్రభుత్వ ఖజానాకు గండి
మైనింగ్‌శాఖ పర్యవేక్షణపై అనుమానాలు
ఏళ్లుగా ఇన్‌చార్జి అధికారితోనే నెట్టుకొస్తున్న వైనం


