కొల్లాపూర్ రూరల్: మండలంలోని సోమశిల శివారు కృష్ణానది బ్యాక్‌వాటర్ ఆవలి ఒడ్డున వెలసిన సంగమేశ్వరాయం శనివారం పూర్తిగా తేలింది. ఈ సంవత్సరం ఉగాది పండుగ రోజు పూజా కార్యక్రమం ప్రారంభం కాగా.. తిరిగి జలాధివాసం అయిన సంగమేశ్వరుడికి దసరా పండుగ రోజు నుంచి పూజలు పునఃప్రారంభమవుతాయని ప్రధాన అర్చకులు రఘురామశర్మ తెలిపారు. ఈ మేరకు సోమవారం స్వామివారికి తొలిపూజ జరుగుతుందని చెప్పారు. అలాగే ఈ సంవత్సరం ఆలయంలో ఒండ్రుమట్టి, బురద తక్కువగా ఉందన్నారు. ప్రస్తుతం స్వామివారి ఆలయంతోపాటు కొంత రహదారి కూడా పూర్తిగా తేలిందన్నారు.


