పోడు భూముల సమస్య పరిష్కారానికి కృషి | - | Sakshi
Sakshi News home page

పోడు భూముల సమస్య పరిష్కారానికి కృషి

Oct 1 2026 1:05 AM | Updated on Oct 1 2026 1:05 AM

పాన్‌గల్‌: తరతరాలుగా పోడు భూములు సాగు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్న గిరిజన రైతులకు భూ హక్కులు కల్పించి పట్టాదారు పాసుపుస్తకాలు ఇప్పించడానికి జాతీయ ఎస్టీ కమిషన్‌ కృషి చేస్తుందని జాతీయ ఎస్టీ కమిషన్‌ సభ్యుడు జాటోతు హుస్సేన్‌నాయక్‌ తెలిపారు. బుధవారం మండలంలోని తెల్లరాళ్లపల్లితండాలో ఆయన పర్యటించి గిరిజనుల సమస్యలపై ఆరా తీశారు. ముందుగా తండాకు వచ్చిన ఆయనకు గిరిజన సంఘం, బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికి శాలువా, పూలమాలతో సన్మానించారు. అనంతరం తండావాసులు పోడు భూములు, సాగు, తాగునీరు, వైద్యం తదితర సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజన రైతుల పోడు భూముల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి భూ హక్కులు కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. మిగతా స్థానిక సమస్యలను జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యేలా చూస్తామని తెలిపారు. ఆయన వెంట కొల్లాపూర్‌ నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జ్‌ ఎల్లేని సుధాకర్‌రావు, మోహన్‌నాయక్‌, సోమ్‌నాథ్‌నాయక్‌, గోపాల్‌నాయక్‌, హరిలాల్‌నాయక్‌, కృష్ణానాయక్‌, వేణు నాయక్‌, అమ్రేష్‌నాయక్‌ పాల్గొన్నారు.

క్రీడల్లో గెలుపోటములు సహజం

వనపర్తి రూరల్‌: క్రీడల్లో గెలుపోటములు సహజమని.. క్రీడాకారులు రెండింటినీ సమానంగా స్వీకరించాలని, పోటీల్లో పాల్గొనడమే ముఖ్యమని జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు నందిమళ్ల శ్రీధర్‌ అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని డా. బాలకిష్టయ్య క్రీడాప్రాంగణంలో నిర్వహించిన జిల్లాస్థాయి అథ్లెటిక్స్‌ జట్టు ఎంపికకు సీఐ రత్నం, డీవైఎస్‌ఓ సుధీర్‌కుమార్‌రెడ్డి, సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నందిమళ్ల శ్రీధర్‌, నందిమళ్ల శ్రీకాంత్‌ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడల్లో రాణించి జిల్లా కీర్తిని మరింత పెంచాలని అకాంక్షించారు. అథ్లెటిక్స్‌ అభివృద్ధికి సహకరిస్తున్న విజ్ఞాన్‌, వాగ్దేవి కళాశాల, బచ్‌పన్‌ పాఠశాలతో పాటు బండారు రఘును ఆయన అభినందించారు. ఎంపికై న జట్టు నవంబర్‌ 14 నుంచి 16వ తేదీ వరకు హైదరాబాద్‌ సమీపంలోని సదాశివపేట మండలం కంకోల్‌లో జరగనున్న 20వ నేషనల్‌ ఇంటర్‌ డిస్ట్రిక్‌ జూనియర్‌ అథ్లెటిక్స్‌ మీట్‌–2026లో పాల్గోంటుందని వివరించారు. కార్యక్రమంలో పీడీలు నందన్‌, జబ్బార్‌, మహేష్‌, ఉమాశంకర్‌, బసవరాజు, అజయ్‌, పులేందర్‌, ప్రవీణ్‌, శోభా, మాలతి, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

క్రీడాస్ఫూర్తిని

అలవర్చుకోవాలి

గద్వాల న్యూటౌన్‌: క్రీడల్లో గెలుపోటమలు సహజమని, ప్రతి క్రీడాకారుడు క్రీడాస్ఫూర్తిని అలవర్చుకోవాలని జిల్లా హకీ అసోసియేషన్‌ అధ్యక్షుడు త్యాగరాజు అన్నారు. స్థానిక నల్ల సోమనాద్రి స్టేడియంలో బుధవారం ఎస్‌జీఎఫ్‌ఏ ఉమ్మడి జిల్లా స్థాయి అండర్‌ –17 హకీ టోర్నమెంట్‌ను ఆయన ప్రారంభించారు. టోర్నీలో గద్వాల జిల్లాతో పాటు వనపర్తి, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ నుంచి సుమారు 100 మంది క్రీడాకారులు పాల్లొన్నారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయయన మాట్లాడారు. ఓటమిని నిరుత్సాహంగా భావించకుండా, మరింత పట్టుదలతో ముందుకు సాగాలని క్రీడాకారులకు సూచించారు. ప్రతిభ కల్గిన క్రీడాకారులను గుర్తించి, వారి భవిష్యత్‌కు ఉపయోగపడే విధంగా నిష్పక్షపాతంగా ఎంపికలు చేపట్టాలని సెలక్షన్‌ కమీటీకి సూచించారు. క్రీడాకారులు ఆటపై పూర్తి శ్రద్ధ పెట్టడంతో పాటు క్రమశిక్షణ పాటించాలన్నారు. గాయాలు కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ టోర్నీ ద్వారా ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి వారికి భవిష్యత్‌లో ఉన్నత స్థాయి పోటీల్లో అవకాశాలు కల్పించేందుకు నిర్వాహకులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ సెక్రటరీ ఆనంద్‌కుమార్‌, పీడీ నాగేష్‌, క్రీడాకారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement