వృద్ధుల హక్కులపై అవగాహన అవసరం | - | Sakshi
Sakshi News home page

వృద్ధుల హక్కులపై అవగాహన అవసరం

Oct 1 2026 1:05 AM | Updated on Oct 1 2026 1:05 AM

వనపర్తి: వృద్ధుల సంరక్షణ, వారి హక్కులు, చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌ అన్నారు. అంతర్జాతీయ వృద్దుల దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం జిల్లాకేంద్రంలోని పాలిటెక్నిక్‌ కళాశాల మైదానం నుంచి ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాల వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించి మాట్లాడారు. వృద్ధుల పట్ల కుటుంబ సభ్యులు, సమాజం బాధ్యతగా వ్యవహరించాలని, వారికి సరైన గౌరవం, భద్రత, సహకారం అందించాలని సూచించారు. వృద్ధుల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం అమలు చేస్తున్న చట్టాలు, సంక్షేమ కార్యక్రమాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. వృద్ధులను నిర్లక్ష్యం చేయకుండా వారి అవసరాలను గుర్తించి, వారికి అండగా నిలవాల్సిన బాధ్యత సమాజంపై ఉందని తెలిపారు. అవగాహన ర్యాలీలో జెడ్పీ సీఈఓ యాదయ్య, డీవైఎస్‌ఓ సుధీర్‌రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి కె.సుధారాణి, వీరయ్య, నర్సింహులుగౌడ్‌, రఘునాథ్‌రెడ్డి, సంక్షేమ వసతిగృహాల విద్యార్థులు, జిల్లా సంక్షేమశాఖ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement