జిల్లాలో మద్యం అక్రమ విక్రయాలు, అందుకు సంబంధించి నిర్వహించే వేలం పాటలపై ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకుంటాం. జిల్లావ్యాప్తంగా ఉన్న బెల్టు షాపుల నిర్వహణపై తనిఖీలు చేపడతాం. ఎక్కడైనా అనధికారికంగా మద్యం విక్రయాలు కొనసాగుతున్నట్లు తెలిస్తే అధికారులు, సిబ్బందికి సమాచారం ఇవ్వాలి చర్యలు తీసుకుంటాం. ఇటీవల బెక్కెం గ్రామంలో నిర్వహించిన వేలం పాట, బెల్టుషాపు నిర్వహణపై దాడులు నిర్వహించేందుకు ఇప్పటికే ఆదేశాలిచ్చాం.
– ఎం.లింగాచారి,
జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్‌శాఖ అఽధికారి
●


