నేడు జిల్లాకు మంత్రుల రాక | - | Sakshi
Sakshi News home page

నేడు జిల్లాకు మంత్రుల రాక

Sep 28 2026 12:23 AM | Updated on Sep 28 2026 12:23 AM

వనపర్తి: జిల్లాలో సోమవారం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరితో పాటు ఎంపీ మల్లు రవి పర్యటించనున్నట్లు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకేంద్రంలోని నల్లచెరువులో చేప పిల్లలను వదిలి కలెక్టరేట్‌ నుంచే వర్చువల్‌గా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం, శ్రీరంగాపురం తహసీల్దార్‌ కార్యాలయ భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారని పేర్కొన్నారు. అలాగే తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌, బీసీ గురుకులం జూనియర్‌ కళాశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని, అనంతరం హౌసింగ్‌, రెవెన్యూ అంశాలపై ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారని వివరించారు.

ప్రజావాణి రద్దు

వనపర్తి: ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, అధికారులతో సమీక్షా సమావేశం ఉన్నందున సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణిని రద్దు చేసినట్లు కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలు ఈ విష యాన్ని గమనించాలని, వచ్చే వారం నిర్వహించే ప్రజావాణిలో తమ సమస్యలు విన్నవించు కునేలా ప్రణాళిక చేసుకోవాలని పేర్కొన్నారు.

జిల్లాస్థాయి

కబడ్డీ జట్టు ఎంపిక

వనపర్తి రూరల్‌: పెబ్బేరులోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఆదివారం జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ ఽఆధ్వర్యంలో జూనియర్‌ (బాలికల) జిల్లా జట్టు ఎంపికలు నిర్వహించినట్లు అధ్యక్షురాలు పద్మజారెడ్డి, ప్రధానకార్యదర్శి కురుమయ్య తెలిపారు. మొత్తం 65 మంది క్రీడాకారులు పాల్గొనగా 18 మందిని త్వరలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు చెప్పారు. అక్టోబర్‌ 10 నుంచి 12వ తేదీ వరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో హెచ్‌ఎం నర్సింహగౌడ్‌, కమలాకర్‌, పీడీ, పీఈటీలు సంతోషి, ఝాన్సీ, మాలతి, అశోక్‌, సీనియర్‌ క్రీడాకారులు శివ, కిషోర్‌, వినయ్‌ తదితరులు పాల్గొన్నారు.

జాతీయస్థాయి

అథ్లెటిక్స్‌కు ఎంపిక

ఖిల్లాఘనపురం: మండలంలోని పర్వతాపురం గ్రామానికి చెందిన ఉదయ్‌కిరణ్‌ జాతీయస్థాయి అథ్లెటిక్స్‌ పోటీలకు ఎంపికయ్యారు. ఆదివారం హన్మకొండలో జరిగిన 12వ తెలంగాణ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ పొటీల్లో పాల్గొని 18 ఏళ్ల విభాగం లాంగ్‌జంప్‌లో 6.75 మీటర్లు దూకి బంగారు పతకం సాధించడంతో పాటు జాతీయస్థాయి పోటీలకు ఎంపికై నట్లు క్రాంతి క్రీడా అసోసియేషన్‌ అధ్యక్షుడు యాదయ్య వివరించారు. అదేవిధంగా మండలంలోని అప్పారెడ్డిపల్లికి చెందిన జె.సాయి సాత్విక్‌ ట్రయాథ్లాన్‌ అండర్‌ 14 విభాగంలో మూడోస్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement