‘ఖిల్లా’ కోట అభివృద్ధికి కృషి : ఎమ్మెల్యే | - | Sakshi
Sakshi News home page

‘ఖిల్లా’ కోట అభివృద్ధికి కృషి : ఎమ్మెల్యే

Sep 28 2026 12:23 AM | Updated on Sep 28 2026 12:23 AM

ఖిల్లాఘనపురం: కాకతీయుల కాలం నాటి ఖిల్లా కోటను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం ఎఫ్‌ఆర్‌ఓ దేవరాజ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ట్రెక్కింగ్‌ను ఆయనతో పాటు కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి జెండా ఊపి ప్రారంభించి స్థానిక నాయకులు, అధికారులు, విద్యార్థులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కాకతీయులు 14 వేల గొలుసుకట్టు చెరువులు తవ్వారని, 80 ఏళ్ల క్రితమే సరళాసాగర్‌లో సైఫన్లను ఏర్పాటు చేశారని తెలిపారు. జిల్లాకేంద్రంలోని పాలిటెక్నికల్‌ కళాశాల భవనాన్ని రూ.10 కోట్లతో అభివృద్ధి చేస్తామని, ఖిల్లాఘనపురం ప్రాంతంలోనూ కాకతీయుల కాలం నాటి ఎన్నో కట్టడాలు ఉన్నాయన్నారు. గణప సముద్రం, గట్టుకాడిపల్లి మధ్యలో గుట్టపై ఉన్న స్థలంలో రూ.2 కోట్లతో హరిత హోటల్‌, గదులు, పార్క్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. నేరేడు చెరువు రిజర్వాయర్‌ను రూ.50 లక్షలతో పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని వివరించారు. పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్టారావుతో మాట్లాడి ఆయా ప్రాంతాల అభివృద్ధికి సుమారు రూ.14 కోట్లు మంజూరు చేయించామన్నారు. విద్యార్థులు అవకాశం ఉన్న సమయంలో జిల్లాలోని ప్రాచీన కట్టడాలను పరిశీలించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement