ఇందిరమ్మ చీరలొచ్చాయ్‌.. | - | Sakshi
Sakshi News home page

ఇందిరమ్మ చీరలొచ్చాయ్‌..

Sep 28 2026 12:23 AM | Updated on Sep 28 2026 12:23 AM

మంచి చీరలు ఇస్తే సంతోషం.. మార్గదర్శకాలు రాగానే పంపిణీ..

● జిల్లాకు తొలివిడతగా

37 వేలు రాక

● జిల్లాకేంద్రంలోని గోదాములో భద్రం

● ప్రభుత్వ ఆదేశాలు

రాగానే పంపిణీకి

శ్రీకారం

ప్రభుత్వం ఏటా మహిళలకు చీరలు పంపిణీ చేయడం గొప్ప విషయం. పండుగల వేళ పేద కుటుంబాలకు ఖర్చు తప్పుతుంది. చీరల రంగులు, నాణ్యత బాగున్నాయని విన్నాం. మంచి చీరలు ఇస్తే సంతోషంగా ఉంటుంది. రానున్న రోజుల్లో మహిళలకు అనేక పథకాలు ఇవ్వాలి.

– రాధ, తిరుమలయ్యపల్లి (మదనాపురం)

రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యమిస్తోంది. ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా జిల్లా కు తొలి విడతగా 37 వేల చీరలు చేరాయి. వీటిని జిల్లాకేంద్రంలోని ప్రధాన గోదాములో భద్రపర్చాం. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాగానే పంపిణీ చేస్తా ం. లబ్ధిదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేస్తాం.

– రామమహేశ్వర్‌రెడ్డి,

జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి

●

మదనాపురం: పేద మహిళల ఆత్మగౌరవాన్ని పెంపొందించడం, పండుగ వేళ వారి ముఖాల్లో ఆనందం నింపడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ చీరల పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా తొలివిడతగా 37 వేల చీరలు జిల్లాకేంద్రానికి చేరుకున్నాయి. జిల్లాకు చేరిన చీరల బస్తాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి జిల్లాకేంద్రంలోని గోదాముల్లో భద్రపర్చారు. నాణ్యత విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించిందని, మహిళా లోకానికి ఎంతగానో నచ్చేలా ఆకర్షణీయమైన అంచులు, మన్నికై న వస్త్రంతో చీరలు తయారు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలోని స్వయం సహాయక సంఘాల మహిళలు, ఆసరా పింఛనుదారులు, అర్హులైన పేద మహిళల జాబితాలను ప్రాథమికంగా పరిశీలిస్తున్నారు. తొలి దఫాగా 37 వేల చీరలు రాగా.. మిగిలిన స్టాక్‌ కూడా త్వరలోనే రానున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లాకేంద్రం నుంచి మండల కేంద్రాలకు అక్కడి నుంచి గ్రామపంచాయతీల వారీగా పంపిణీ చేసేందుకు రూట్‌మ్యాప్‌ సిద్ధం చేస్తున్నారు. జిల్లాలోని 15 మండలాలు.. 268 గ్రామపంచాయతీల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో అందజేసేందుకు క్షేత్రస్థాయి సిబ్బందికి తగిన ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement