‘ఉల్లాస్‌’తో అక్షరాస్యతకు బాట | - | Sakshi
Sakshi News home page

‘ఉల్లాస్‌’తో అక్షరాస్యతకు బాట

Sep 28 2026 12:23 AM | Updated on Sep 28 2026 12:23 AM

వనపర్తిటౌన్‌: వయోజన నిరక్షరాస్యులు అక్షరాస్యులుగా మారడంతో పాటు రోజువారీ జీవితానికి అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు ఉల్లాస్‌ కార్యక్రమం దోహదపడుతుందని జిల్లా కమ్యూనిటీ మొబిలైజింగ్‌ అధికారి ప్రతాప్‌రెడ్డి తెలిపారు. ఆదివారం జిల్లాలోని వనపర్తి, అమరచింత, ఆత్మకూర్‌, చిన్నంబావి, ఖిల్లాఘనపురం, గోపాల్‌పేట, కొత్తకోట, మదనాపురం, పాన్‌గల్‌, పెబ్బేరు, పెద్దమందడి, రేవల్లి, శ్రీరంగాపురం, వీపనగండ్ల, ఏదుల మండలాల్లో నిర్వహించిన ఉల్లాస్‌ పరీక్షకు మొత్తం 17,506 మంది వయోజన నిరక్షరాస్యులు హాజరయ్యారు. పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లిలో నిర్వహించిన పరీక్షను ఆయన పరిశీలించి మాట్లాడారు. పరీక్షల ద్వారా అభ్యసించిన అంశాలను సమీక్షించుకునే అవకాశం కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ వీఓఏలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement