గోపాల్‌పేట: క్షయ నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా క్షయ నియంత్రణ అధికారి డా. సాయినాథ్‌రెడ్డి కోరారు. శుక్రవారం మండలంలోని పొలికెపాడులో సర్పంచ్ బంగారయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన క్షయ నిర్ధారణ పరీక్షల శిబిరానికి ఆయన హాజరై ప్రారంభించి మాట్లాడారు. రెండు వారాల కంటే ఎక్కువ దగ్గు ఉంటే వెంటనే స్థానికంగా ఉండే ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి చూపించుకోవాలని సూచించారు. వ్యాధి సోకిందని భయపడాల్సిన అవసరం లేదని.. వైద్యులు సూచించిన విధంగా మందులు వాడితే తప్పకుండా నయమవుతుందని వివరించారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ చాంద్‌పాషా, వైద్య సిబ్బంది, ఉపసర్పంచ్ జంపన్న, వార్డు సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.


