విద్యార్థులు దేశం గర్వించేస్థాయికి ఎదగాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులు దేశం గర్వించేస్థాయికి ఎదగాలి

Sep 26 2026 1:38 AM | Updated on Sep 26 2026 1:38 AM

ఆత్మకూర్‌: ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్య అందిస్తున్నామని.. బాగా చదివి దేశం గర్వించేస్థాయికి ఎదగాలని డీఐఈఓ నరేంద్రకుమార్‌ అన్నారు. శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ కళాశాలలో నిర్వహించిన ప్రెషర్స్‌డేకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థుల జీవితంలో కళాశాల పర్యాయం కీలకమైందని.. చదువుపై ప్రత్యేక దృష్టిసారించాలని, క్రమశిక్షణతో మెలగాలని, వ్యక్తిత్వ వికాసం, నైపుణ్యాలు, ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకెళ్లాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ సైదులు, అధ్యాపకులు భాగ్యవర్ధన్‌రెడ్డి, టీజే విశ్వేశ్వర్‌, రాఘవేందర్‌రావు, సునీల్‌కుమార్‌, కురుమూర్తి తదితరులు పాల్గొన్నారు.

‘బుద్దారం’ నిర్వాసితులకు న్యాయం చేయాలి

గోపాల్‌పేట: బుద్దారం నిర్వాసితులకు ప్రభుత్వం న్యాయపరమైన పరిహారం ఇచ్చే వరకు అండగా ఉంటామని భారతీయ కిసాన్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు సుబ్బయ్య యాదవ్‌ అన్నారు. శుక్రవారం సంఘం నాయకులు రైతులతో కలిసి గోపాల్‌పేట తహసీల్దార్‌ కార్యాలయానికి పాదయాత్ర చేయడాన్ని స్థానిక పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని అంబేడ్కర్‌, పూలే విగ్రహాలకు పూలమాల వేసి మాట్లాడారు. రైతుల సమస్యలను తెలిపేందుకు శుక్రవారం ఉపసర్పంచ్‌ ఆధ్వర్యంలో బాధిత రైతులతో గోపాల్‌పేట వరకు పాదయాత్ర చేసి తహసీల్దార్‌ కార్యాలయంలో వినతిపత్రం అందించాలని నిర్ణయించి గురువారం ఎస్సై శశిధర్‌కు సమాచారం ఇచ్చామన్నారు. అయినా కార్యక్రమం ప్రారంభమయ్యే సమయంలో పోలీసులు వచ్చి అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బాధిత రైతులకు ఎకరాకు రూ.45 లక్షలతో పాటు బావులు, బోర్లు, తోటలు ఇతరత్రా ఉంటే అదనంగా డబ్బులు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. వచ్చే సోమవారం బుద్దారం సర్పంచ్‌, ఉపసర్పంచ్‌తో కలిసి పెద్దఎత్తున కార్యక్రమం చేపడతామని.. అన్ని సంఘాలు కలిసివచ్చి విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో బుద్దారం గ్రామ రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement