గణనాథుడి శోభాయాత్రకు భారీ బందోబస్తు | - | Sakshi
Sakshi News home page

గణనాథుడి శోభాయాత్రకు భారీ బందోబస్తు

Sep 20 2026 12:39 AM | Updated on Sep 20 2026 12:39 AM

వనపర్తి: జిల్లావ్యాప్తంగా గణనాథుల నిమజ్జనం సాంప్రదాయబద్ధంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని, శోభాయాత్రలో డీజేలు వినియోగించడం, బాణసంచా కాల్చడం పూర్తిగా నిషేధమని ఎస్పీ సునీతారెడ్డి తెలిపారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని నల్లచెరువు వద్ద నిమజ్జనం జరిగే ప్రాంతంతో పాటు శోభాయాత్ర మార్గాలను డీఎస్పీ గిరిబాబు, సీఐ సుగంధ రత్నం తదితర అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిమజ్జన, శోభాయాత్రలు సీసీ కెమెరాల నిఘాలో కొనసాగుతాయని.. అన్ని ప్రధాన ప్రాంతాల్లో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. రహదారుల మరమ్మతు, బారికేడ్లు, విద్యుత్‌ దీపాలు, క్రేన్లు, తాగునీటి సదుపాయం కల్పించడంతో పాటు నిమజ్జన ప్రాంతాల్లో గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. ఉత్సవాల నిర్వాహకులు పూజా కార్యక్రమాలను త్వరగా ముగించి వెలుతురు ఉండగానే విగ్రహాలను నిమజ్జన ప్రాంతాలకు తరలించాలన్నారు. శోభాయాత్రల్లో పాల్గొనే చిన్నారులు, మహి ళల భద్రతకు ప్రత్యేక దృష్టి సారిస్తామని, ట్రాక్టర్లు, లారీలు తదితర వాహనాల్లో ప్రయాణించే వారు జా గ్రత్తలు పాటించాలని కోరారు. నిమజ్జన సమయంలో క్రేన్ల సాయంతో విగ్రహాలను నీటిలోకి దించే సమ యంలో యువత, మహిళలు, చిన్నారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టామని.. ఉత్సవ క మిటీలు పోలీసుల సూచనలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, చట్టవిరుద్ధంగా ప్రవర్తించే వా రిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement