రెండేళ్లుగా కబడ్డీ ఆడుతున్నా. గతంలో సీఎం కప్ పోటీల్లో పాల్గొన్నా. ప్రస్తుతం లెఫ్ట్ కార్నర్, రైట్ రైడర్‌గా శిక్షణ తీసుకుంటున్నా. అకాడమీలో శిక్షణ బాగుంది. ఆటలోని మెళకువలు నేర్చుకుంటున్నా. నిరంతరం సాధన చేసి భవిష్యత్తులో భారత జట్టుకు ఆడాలనుకుంటున్నా.
– వి.సచిన్, మహబూబ్‌నగర్
పీకేఎల్ స్థాయికి ఎదగాలని ఉంది
చిన్నప్పటి నుంచే కబడ్డీ అంటే ఇష్టం. మూడేళ్లుగా ఆడుతున్నా. రెండుసార్లు అంతర్‌జిల్లా రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో జిల్లాకు ప్రాతినిధ్యం వహించా. అకాడమీకి ఎంపిక కావడం ఆనందంగా ఉంది. భవిష్యత్తులో ప్రో కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో ఆడటంతోపాటు భారత జట్టుకు ఎంపిక కావాలన్నదే నా లక్ష్యం.
– శివశంకర్, మహబూబ్‌నగర్


