ఏడేళ్లుగా కబడ్డీ ఆడుతున్నా. సబ్ జూనియర్ రెండు, జూనియర్ ఒకటి, సీనియర్ అంతర్‌జిల్లా రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నా. ప్రస్తుతం రైడర్‌గా శిక్షణ తీసుకుంటున్నా. భవిష్యత్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడమే నా లక్ష్యం.
– లోకేష్, ఆదిలాబాద్
ఆల్‌రౌండర్‌గా మెరుగవ్వాలి
అకాడమీలో డిఫెండర్, ఆల్‌రౌండర్‌గా శిక్షణ తీసుకుంటున్నా. గతేడాది హర్యానాలోని సోనిపట్‌లో జరిగిన సబ్ జూనియర్ జాతీయస్థాయి కబడ్డీ పోటీల్లో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించా. మూడు సబ్ జూనియర్, ఒక జూనియర్, ఒక సీనియర్ అంతర్‌జిల్లా రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లాకు ప్రాతినిధ్యం వహించా. భవిష్యత్తులో భారత జట్టులో చోటు దక్కించుకోవడమే నా లక్ష్యం. – గౌతమ్, మహబూబ్‌నగర్
ఏషియన్ గేమ్స్‌లో ఆడాలన్నదే టార్గెట్
మూడేళ్లుగా కబడ్డీ ఆడుతున్నా. సబ్ జూనియర్ రాష్ట్రస్థాయి టోర్నీలో పాల్గొన్నా. మా జిల్లా కబడ్డీ సంఘం కార్యదర్శి సూచనతో అకాడమీ ఎంపికలకు హాజరయ్యా. ఇక్కడికి ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. జాతీయస్థాయి పోటీల్లో రాణించడంతోపాటు తెలంగాణ తరఫున ఏషియన్ గేమ్స్‌లో ఆడాలన్నదే నా లక్ష్యం.
– ఉమేష్‌కుమార్‌రెడ్డి, ఖమ్మం
●


