ఎకై ్సజ్‌ శాఖలో భారీగా బదిలీలు | - | Sakshi
Sakshi News home page

ఎకై ్సజ్‌ శాఖలో భారీగా బదిలీలు

Sep 3 2026 8:47 AM | Updated on Sep 3 2026 8:47 AM

కమిషనర్‌ ఆమోదంతో సీఐలు,

ఎస్‌ఐలకు స్థానచలనం

నారాయణపేట: తెలంగాణ ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ శాఖలో భారీస్థాయిలో బదిలీలు చోటుచేసుకున్నాయి. సీఐ, ఎస్‌ఐ కేడర్‌ అధికారులకు స్థానచలనం కల్పిస్తూ బుధవారం సాయంత్రం నుంచి వరుసగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ కమిషనర్‌ ఆమోదంతో గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎకై ్సజ్‌ డిప్యూటీ కమిషనర్‌ (ఇన్‌చార్జి) హరికృష్ణ ప్రొసీడింగ్స్‌ జారీ చేశారు. బదిలీ అయిన అధికారులు ప్రస్తుత పోస్టు నుంచి వెంటనే రిలీవ్‌ అయి, కొత్తగా కేటాయించిన స్థానాల్లో తక్షణమే విధుల్లో చేరాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

● ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా ఎకై ్సజ్‌ పరిధిలోనూ పలువురు అధికారులకు స్థానచలనం కలిగింది. నారాయణపేట ఎకై ్సజ్‌ సీఐ అనంతయ్య శేరిలింగంపల్లికి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో నల్లగొండ డీటీఎఫ్‌ సీఐ సైదులు వస్తున్నారు.

● నారాయణపేట ఎకై ్సజ్‌ సర్కిల్‌ ఎస్‌ఐలు గురువయ్య దేవరకొండకు, రమేష్‌ కోదాడ చెక్‌పోస్టు, శిరీష తుంగతుర్తికి బదిలీ అయ్యారు. కోస్గి సీఐ బాలకృష్ణ మల్కాజ్‌గిరికి బదిలీ కాగా.. నారాయణపేట బీఎంపీపీలో పనిచేస్తున్న శ్రావణ్‌కుమార్‌ సైబరాబాద్‌ పరిధిలోని పటాన్‌చెరువుకు బదిలీ అయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement