నానో ఎరువులు వినియోగించాలి : డీఏఓ | - | Sakshi
Sakshi News home page

నానో ఎరువులు వినియోగించాలి : డీఏఓ

Aug 30 2026 12:39 AM | Updated on Aug 30 2026 12:39 AM

పాన్‌గల్‌: రైతులు రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి నానో ఎరువులు వినియోగించేలా అధికారులు అవగాహన కల్పించాలని జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు అన్నారు. శనివారం మండలంలోని రేమద్దులలో ఆత్మ శిక్షణ కార్యక్రమంలో ఆయనతో పాటు కేవీకే శాస్త్రవేత్త డా. భవాని పాల్గొని రైతుల పొలాలకు వెళ్లి నానో ఎరువులను పిచికారీ చేసి అవగాహన కల్పించడంతో పాటు ఆయిల్‌పాం పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు ఎక్కువగా రసాయన ఎరువులకు అలవాటు పడ్డారని.. వాటి వినియోగం తగ్గించేందుకు నానో యూరి యా, నానో డీఏపీ, నానో జింక్‌ అందుబాటులోకి వ చ్చినట్లు పేర్కొన్నారు. ఎల్‌నినో ప్రభావంతో ఆరుతడి పంటలు, కూరగాయాలు, పప్పు ధాన్యాలు, ఆయిల్‌పాం సాగు చేసుకోవాలని రైతులకు సూచించారు. సమావేశంలో ఏడీఏ తిప్పేస్వామి, ఇన్‌చార్జ్‌ ఏఓ రమేష్‌నాయక్‌, హెచ్‌ఓ కృష్ణయ్య, సర్పంచ్‌ నిరంజన్‌, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement