ఇతర పంటల సాగుతో పోలిస్తే ఆయిల్‌పాం సాగుతో రైతులకు మంచి లాభాలు ఉంటాయి. నాలుగేళ్లకు దిగుబడి ప్రారంభమై 30 ఏళ్ల వరకు కాపునిస్తోంది. అంతర పంటలు సైతం సాగు చేసుకునే అవకాశం ఉండటంతో రైతులకు మరింత కలిసి వస్తుంది. ప్రస్తుతం టన్నుకు రూ.23,488 ధర పలుకుతోంది. జిల్లా రైతులు సాగుకు మక్కువ కనబరుస్తున్నారు. ఎల్‌నినో కారణంగా రైతులు వరి వేయకుండా ఇలాంటి పంటల సాగుపై దృష్టి సారిస్తే బాగుంటుంది. ప్రభుత్వం ఇచ్చే రాయితీని సద్వినియోగం చేసుకుంటూ లాభాలు పొందవచ్చు. – విజయభాస్కర్, జిల్లా ఉద్యాన అధికారి


