జిల్లాలో క్రమంగా పెరుగుతున్న సాగు విస్తీర్ణం
● అవగాహన కల్పిస్తున్న ఉద్యాన అధికారులు
● రాయితీపై మొక్కలు, డ్రిప్ పరికరాలు అందజేత
నా పేరు హరీశ్‌రెడ్డి.. మాది కొత్తకోట. నేను గతంలో ఐదెకరాల్లో వరి వేసేవాడిని. వరికి పెట్టుబడి ఎక్కువ.. కూలీల కొరత, ఆదాయం తక్కువ ఉండటంతో ఉద్యానశాఖ అధికారులు, స్థానిక వ్యవసాయ అధికారుల సూచన మేరకు
నాలుగేళ్ల కిందట ఆయిల్‌పాం సాగు చేశా. ప్రస్తుతం ఆదాయం బాగానే ఉంది. రైతులు సాంప్రదాయ పంటలకు స్వస్తి పలికి ఆదాయానిచ్చే వాణిజ్య పంటల సాగుపై దృష్టి సారిస్తే బాగుంటుంది.
కొత్తకోట రూరల్: జిల్లా రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారిస్తున్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకునేందుకు ఆయిల్‌పాం సాగుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటి వరకు వాణిజ్య పంట అయిన పత్తికే అధిక ప్రాధాన్యతనిచ్చిన రైతులు ప్రస్తుతం ఆయిల్‌పాం సాగు వైపు అడుగులు వేస్తున్నారు. ఉద్యాన అధికారులు సాగుపై కల్పిస్తున్న అవగాహన కార్యక్రమాలు సత్ఫలితాలిస్తున్నాయి. దీంతో జిల్లాలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది.
మండలాల వారీగా సాగు వివరాలు (ఎకరాల్లో..)


