ఆత్మకూర్: పట్టణంలోని మున్సి్‌ఫ్ మెజిస్ట్రేట్ కోర్టులో సెప్టెంబర్ 12న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని న్యాయమూర్తి శిరీష కోరారు. శనివారం కోర్టు భవనంలో కొత్తకోట, ఆత్మకూర్, మదనాపురం, అమరచింత మండలాల పోలీస్ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ ఎంతో ఉపయోగపడుతుందన్న విషయాన్ని కక్షిదారులకు వివరించాలన్నారు. ఎంతోమంది క్షణికావేశంలో కేసులు పెట్టుకొని కోర్టుల చుట్టూ తిరుగుతూ విలువైన సమయాన్ని వృథా చేసుకుంటున్నారని.. రాజీయే రాజమార్గమని పేర్కొన్నారు. సమావేశంలో సీఐలు శివకుమార్, రమేష్, ఎస్సైలు జయన్న, స్వాతి, విక్రమ్, ఏఎస్‌ఐలు హరిచంద్రగౌడ్, లోక్‌అదాలత్ సభ్యులు, న్యాయవాదులు, లోక్‌అదాలత్ సిబ్బంది, ఆయా మండలాల పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


