ఆయిల్‌పాం సాగు చేస్తున్న రైతులకు ప్రభుత్వం మొక్క నుంచి డ్రిప్ పరికరాల వరకు రాయితీలు అందిస్తోంది. ఒక మొక్క ఖరీదు రూ.193 కాగా ఎకరానికి 57 మొక్కలు నాటాల్సి ఉంటుంది. అయితే రైతులు ఒక్కో మొక్కకు రూ.20 చెల్లిస్తే సరిపోతుంది. మిగతా మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. అలాగే డ్రిప్ పరికరాలను సైతం 90 శాతం రాయితీపై అందిస్తున్నారు. మొక్కలు నాటిన నాటి నుంచి నాలుగేళ్ల పాటు ఏడాదికి ఎకరాకు రూ.4,200 చొప్పున అందజేస్తుంది. ఇందులో మొక్కల సంరక్షణకు రూ.2,100.. అంతర పంటల సాగుకు మరో రూ.2,100 చెల్లిస్తున్నారు.


