సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి | - | Sakshi
Sakshi News home page

సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి

Aug 29 2026 12:46 AM | Updated on Aug 29 2026 12:46 AM

సామాజిక మాధ్యమాల్లో పంపిన సమస్యలపై అధికారులు స్పందించాలి

మండలస్థాయి సమీక్షలో మంత్రి జూపల్లి కృష్ణారావు

పాన్‌గల్‌: ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి వాట్సప్‌, మెయిల్‌ ద్వారా సమస్యలు తెలియజేసినా అధికారులు పరిష్కరించాలని రాష్ట్ర ఎకై ్సజ్‌, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి అధ్యక్షతన అధికారులతో సమీక్ష నిర్వహించారు. మండలంలోని గ్రామస్తులు కార్యాలయాల్లో సమర్పించిన ఫిర్యాదుల్లో ఇప్పటి వరకు పరిష్కారమైనవి, పెండింగ్‌లో ఉన్న వాటిపై సమీక్షించారు. రెవెన్యూ సమస్యలపై ముందుగా సమీక్షించి భూ సమస్యల ఫిర్యాదులపై గ్రామాల వారీగా పరిశీలించి పరిష్కారానికి అధికారులను ఆదేశించారు. బుసిరెడ్డిపల్లికి చెందిన సంగనమోని రాముడు 37 గుంటల పొలం కాల్వ తవ్వకంలో పోకముందే పోయినట్లు అధికారులు ఖాతా నుంచి తొలగించారని.. అధికారుల తప్పిదానికి రైతులను బాధ్యులను చేయడం సరికాదని, ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఎలాంటి ఆర్డర్‌ కాపీలు లేకున్నా కోర్టు కేసుల పేరుతో భూ సమస్యలు పరిష్కారం కాకుండా జాప్యం చేయడం సరికాదన్నారు. ప్రజలు సమస్యల పరిష్కారానికి కార్యాలయాలకు నెలల తరబడి పనులు వదిలి తిరగాల్సిన అవసరం ఉండొద్దని, అధికారుల్లో మార్పు రావాలని వచ్చిన దరఖాస్తులను గరిష్టంగా వారం రోజుల్లో పరిష్కరించాలని ఆదేశించారు. విద్యార్థుల ధ్రువపత్రాలు రెండు, మూడురోజుల్లో అందించాలని రెవెన్యూ అధికారులను కోరారు. అఽధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ప్రజల సమస్యలు పరిష్కరించాలన్నారు.

అప్పులపాలు కావద్దు..

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు నిర్మాణాల పేరిట అప్పుల పాలు కావద్దని.. ప్రభుత్వం ఇచ్చే రూ.5 లక్షలతో పూర్తి చేసుకోవాలని సూచించారు. మండలంలో ఆర్థిక పరిస్థితి బాగోలేక ఇళ్లు మంజూరైన 65 మంది లబ్ధిదారులు నిర్మించుకోలేదనే విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఇలాంటి వారికి బ్యాంకులు, మహిళా సంఘాల ద్వారా రుణాలు ఇప్పించాలని అధికారులు, నాయకులకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో మూత్రశాలలు, మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.కోటి మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. విద్యుత్‌ సామగ్రి పేరుతో రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో కొందరు తమ సమస్యలను రాతపూర్వకంగా మంత్రికి అందజేశారు.

సమస్యలు వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్‌

మండలస్థాయి అధికారులు తమ పరిఽధిలోని సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి ఆదేశించారు. తమ పరిధిలో పరిష్కారం కాని వాటిని మాత్రమే జిల్లాకు సిఫారస్‌ చేయాలన్నారు.

కునుకుతీసిన సీఐ.. సెల్‌ఫోన్‌లో అధికారులు బిజీ...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement