జిల్లా ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను కలెక్టర్ దృష్టి తీసుకెళ్లాం. ఆయన తన నిధులిచ్చి పరిష్కరించేందుకు ఆదేశించారు. ఖాళీలున్నా.. నిత్యం వచ్చే ఓపీ సేవలు, ఇన్‌పేషంట్ల సేవల విషయంలో ఎక్కడా రాజీపడకుండా సేవలందిస్తున్నాం. కమిటీ సమావేశం చివరగా ఏప్రిల్ 6న నిర్వహించాం. మళ్లీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. వైద్య పరీక్షలు పూర్తిగా ఆస్పత్రిలోనే చేపట్టేందుకు తగిన చర్యలు తీసుకున్నాం.
– డా. చంద్రమోహన్,
సూపరింటెండెంట్, జీజీహెచ్


