ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ కర్ణాటక నుంచి వరదనీరు భారీగా చేరుతుండడంతో దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతుంది. ఈ మేరకు ఆదివారం 11 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్‌ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువలో 6 యూనిట్ల ద్వారా 234 మెగావాట్లు, దిగువలో 5 యూనిట్ల ద్వారా 200 మెగావాట్లు చేపట్టారు. ఎగువ, దిగువ జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఇప్పటి వరకు 37.781 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి విజయవంతంగా చేపట్టామన్నారు. ప్రస్తుతం 33 వేల క్యూసెక్కుల నీటిని వినియోగించి దిగువ శ్రీశైలానికి వదులుతున్నామని చెప్పారు.
ప్రాణాలను
పణంగా పెట్టొదు
అమరచింత: ఉధృతంగా ప్రవహించే నీటితో ఆటలొద్దని.. సెల్ఫీల కోసం పోటీపడి ప్రాణాలను పణంగా పెట్టొదని అమరచింత ఎస్‌ఐ స్వాతి సూచించారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఆదివారం జూరాల ప్రాజెక్టును సందర్శించి మాట్లాడారు. ప్రాజెక్టు వద్ద బందోబస్తు చర్యలు చేపట్టామని.. దిగువ పుష్కరఘాట్ వద్దకు వెళ్లే రహదారిని మూసి వేయించినట్లు చెప్పారు. ప్రాజెక్టు రహదారిపై వాహనాలు నిలువకుండా పార్కింగ్‌కు స్థలం కేటాయించామని తెలిపారు. వరదను చూడాలనే ఉద్దేశంతో ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లవద్దని.. పోలీసుల సూచనలు పాటించాలని పర్యాటకులకు సూచించారు. సందర్శకులు సురక్షిత ప్రదేశాల నుంచే కృష్ణమ్మ అందాలను తిలకించాలని.. అ త్యవసర పరిస్థితుల్లో వెంటనే సమీప పోలీసు సిబ్బందికి సమాచారం ఇవ్వాలన్నారు.
అన్నవరం క్షేత్రానికిప్రత్యేక బస్సు
కొల్లాపూర్: స్థానిక ఆర్టీసీ డిపో నుంచి అన్నవరం క్షేత్రానికి ఈ నెల 8న ప్రత్యేక బస్సు ఏర్పాటుచేసినట్లు డిపో మేనేజర్ మల్లేశయ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కొల్లాపూర్ నుంచి సాయంత్రం 6 గంటలకు సూపర్ లగ్జరీ బస్సు బయలుదేరి.. భద్రాచలం, విజయవాడ, అన్నవరం, వైజాగ్, సింహాచలం చేరుకుంటుందని పేర్కొన్నారు. 11న సాయంత్రం తిరిగి కొల్లాపూర్ చేరుకుంటుందని ఆయన వివరించారు. బస్సులో రానుపోను ప్రయాణ చార్జీలు నాలుగు రోజులకు పెద్దలకు రూ. 3వేలు, పిల్లలకు రూ. 2వేలుగా నిర్ణయించడం జరిగిందన్నారు. భక్తులు టికెట్ల బుకింగ్ కోసం స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో సంప్రదించాలని సూచించారు.


