ఎన్నికల బరిలో 20 మంది | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల బరిలో 20 మంది

Jul 7 2026 12:33 AM | Updated on Jul 7 2026 12:33 AM

అమరచింత: అమరచింత చేనేత సహకార సంఘం ఎన్నికల బరిలో 20 మంది బరిలో ఉన్నట్లు ఎన్నికల అధికారి ప్రసాదరావు తెలిపారు. సోమవారం నలుగురు నామినేషన్లను ఉపసంహరించుకోగా మిగిలిన వారు ఎన్నికల బరిలో నిలిచారు. అభ్యర్థులకు గుర్తులను కేటాయించడంతో ఎన్నికల కోలాహలం నెలకొంది. పదోతేదీన ఎన్నికలు ఉండటంతో పోటీలో ఉన్న అభ్యర్థులు మంగళవారం నుంచి ప్రచారం ప్రారంభించనున్నారు. ఎన్నికలు జరిగితే సంఘం ద్వారా రూ.లక్ష ప్రభుత్వానికి చెల్లించాలనే నిబంధన ఉండటంతో మూడు రోజులుగా ఏకగ్రీవానికి చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. మొత్తం 9 డైరెక్టర్‌ స్థానాలకు 20 మంది బరిలో ఉండగా.. వీరిలో 16 మంది పురుషులు, నలుగుగురు మహిళలు ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement