99.87 శాతం ఫారాల పంపిణీ పూర్తి | - | Sakshi
Sakshi News home page

99.87 శాతం ఫారాల పంపిణీ పూర్తి

Jul 7 2026 12:33 AM | Updated on Jul 7 2026 12:33 AM

వనపర్తి: జిల్లాలో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ యుద్ధప్రాతిపదికన కొనసాగుతోందని.. ప్రస్తుతం 99.87 శాతం ఎన్యూమరేషన్‌ ఫారాల పంపిణీ పూర్తయిందని రెవెన్యూ అదనపు టి.వినోద్‌కుమార్‌ తెలిపారు. సోమవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి హైదరాబాద్‌ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలతో వీడియో కాన్ఫరెన్‌న్స్‌ నిర్వహించగా.. జిల్లా నుంచి అదనపు కలెక్టర్‌ పాల్గొని వివరాలు వెల్లడించారు. వనపర్తి నియోజకవర్గంలో 2,75,570 మంది ఓటర్లుండగా.. ఇప్పటి వరకు 2,75,214 మంది ఓటర్లకు బీఎల్వోలు ఇంటింటికి తిరిగి ఎన్యూమరేషన్‌ ఫారాలు అందజేశారన్నారు. ప్రస్తుతం పూరించిన ఫారాలను తిరిగి తీసుకునే ప్రక్రియ కొనసాగుతోందని.. ఇప్పటి వరకు 17,411 దరఖాస్తులు డిజిటలైజేషన్‌ పూర్తి చేసినట్లు తెలిపారు. ఒక్కో పోలింగ్‌ కేంద్రంలో 1,200 ఓటర్లు మించకుండా, 2 కిలోమీటర్ల పరిధి దాటకుండా రేషనలైజేషన్‌ తయారు చేసే ప్రక్రియ సైతం ప్రారంభించినట్లు వివరించారు. సమావేశంలో ఆర్డీఓ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్‌ వెంకటేశ్వర్లు, ఎన్నికల సెక్షన్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement