ఆశించిన స్థాయిలో లేదు.. | - | Sakshi
Sakshi News home page

ఆశించిన స్థాయిలో లేదు..

Jul 6 2026 12:22 AM | Updated on Jul 6 2026 12:22 AM

ఆశించిన స్థాయిలో లేదు.. విద్యార్థులు ఎంపిక చేసుకుంటేనే..

ప్రభుత్వం డిగ్రీలో వివిధ సీట్ల భర్తీ కోసం నిర్వహించిన దోస్త్‌ అడ్మిషన్ల ప్రక్రియ ఇప్పటికే మూడు దశల్లో పూర్తి అయ్యింది. అయినా ఆశించిన స్థాయిలో అడ్మిషన్లు జరగలేదు. ఈ క్రమంలో ఎప్‌ సెట్‌ వంటి కౌన్సెలింగ్‌ ప్రక్రియ ముగిస్తే మరో దశ స్పెషల్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించి ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసే అవకాశం ఉంది.

– రమేష్‌బాబు, రిజిస్ట్రార్‌, పీయూ

పీయూ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలల్లో పూర్తిస్థాయిలో సీట్లు భర్తీ కాలేదని తెలుస్తుంది. ప్రభుత్వం త్వరలో మరో దశ స్పెషల్‌ కౌన్సెలింగ్‌కు ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది. ప్రైవేటు కళాశాలల్లో కూడా సీట్లు భర్తీ అవుతాయి. కౌన్సెలింగ్‌లో విద్యార్థులు ఏ కళాశాల ఎంపిక చేసుకుంటే అందులో సీటు వస్తుంది.

– చంద్రకిరణ్‌,

డైరెక్టర్‌ ఆఫ్‌ అకడమిక్‌, ఆడిట్‌సెల్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement