ఖిల్లాఘనపురం
మండలం అల్లమాయపల్లి సమీపంలో కమాలొద్ధీన్‌పూర్ బ్రాంచ్ కెనాల్లో
ఏపుగా పెరిగిన జమ్ము
మద్దిగట్ల రోడ్ సమీపంలో
పైపుల వద్ద ఇసుక మేటలు
ఖిల్లాఘనపురం మండలంతో పాటు ముసాపేట, అడ్డాకుల మండలాల్లోని పలు గ్రామాలకు సాగునీరు అందించేందుకు నిర్మించిన కేఎల్‌ఐ కాల్వలు జమ్ము, ముళ్లపొదలతో నిండిపోయాయి. పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పైపుల్లో ఇసుక మేటలు వేయడంతో నీరు ముందుకు పారని పరిస్థితి నెలకొంది. బిజినేపల్లి మండలంలోని మంగనూరు శివారులో కేఎల్‌ఐ ప్రధాన కాల్వ నుంచి ఖిల్లాఘనపురం, కమాలొద్ధీన్‌పూర్ బ్రాంచ్ కెనాల్స్‌కు నీటిని వదులుతారు. అన్ని గ్రామాల చెరువులకు నీరు పారేలా చిన్న కాల్వలు తవ్వారు. చెరువులు నిండిన తర్వాత మిగిలిన నీరు పెద్ద వాగుకు చేరుతుంది. ప్రస్తుతం రెండు ప్రధాన కాల్వల్లో ఇసుక మేటలు వేయడంతో పాటు జమ్ము, ముళ్లపొదలు ఏపుగా పెరిగాయి. వీటిని తొలగిస్తే తప్పా నీరు ముందుకు పారదు. అధికారులు స్పందించి త్వరితగతిన తొలగింపునకు చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. ఈ విషయమై నీటిపారుదలశాఖ డీఈ బాబుచంద్‌ను సంప్రదించగా.. త్వరలోనే ఖిల్లాఘనపురం, కమాలోద్ధీన్‌పూర్ బ్రాంచ్ కాల్వలను పరిశీలించి అవసరమైన చోట ఏజెన్సీ వారితో మాట్లాడి జమ్ము, ఇసుక మేటలు తొలగిస్తామని సమాధానమిచ్చారు. – ఖిల్లాఘనపురం
పర్వతాపురం,
మామిడిమాడ శివారులో
ఖిల్లాఘనపురం
బ్రాంచ్ కెనాల్ ఇలా..
అప్పారెడ్డిపల్లి మైనర్ కాల్వకు ఏర్పాటుచేసిన
పైపులో నిండిన ఇసుక


