గడువులోగా వివరాల నమోదు | - | Sakshi
Sakshi News home page

గడువులోగా వివరాల నమోదు

Jul 6 2026 12:22 AM | Updated on Jul 6 2026 12:22 AM

వనపర్తి: ఎన్నికల సంఘం నిర్ణయించిన గడువు జూలై 24లోగా పూరించిన ఎన్యూమరేషన్‌ ఫారాల్లోని వివరాలను యాప్‌లో నమోదు చేయాలని ఓటరు నమోదు అధికారి, ఆర్డీఓ సుబ్రమణ్యం బీఎల్వోలను ఆదేశించారు. ఆదివారం పుర పరిధిలోని గాంధీనగర్‌, హరిజన్‌వాడ, నాగవరంలో ఉన్న 120, 122, 123, 160, 170 పోలింగ్‌ కేంద్రాల్లో పర్యటించి ప్రత్యేక ఓటరు నమోదు ప్రక్రియను పరిశీలించారు. బూత్‌ లెవల్‌ అధికారులు, పర్యవేక్షకులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఎన్యూమరేషన్‌ ఫారాల పంపిణీ, పూరించే విధానం పరిశీలించి పలు సూచనలు చేశారు. ఓటర్లతో ఫారాలను తప్పులు లేకుండా పూరించి నిర్ణీత గడువులోగా యాప్‌లో నమోదు చేయాలన్నారు. అదేవిధంగా ఓటర్లతో మాట్లాడి ఫారాలు నింపడంలో తలెత్తుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. పూరించిన ఫారాలను కచ్చితంగా తిరిగి బీఎల్వోలకు ఇవ్వాలని.. లేనిపక్షంలో ఓటరు జాబితాలో పేరు నమోదు కాదని అవగాహన కల్పించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement