వనపర్తి: జిల్లాలో ప్రజా అనుకూల పోలీసింగ్ విధానం అమలు చేస్తున్నామని ఎస్పీ సునీతారెడ్డి తెలిపారు. శుక్రవారం డీజీపీ సీవీ ఆనంద్ హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. జిల్లా నుంచి ఎస్పీ పాల్గొని వివరాలు వెల్లడించారు. మహిళలు, చిన్నారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని, కేసుల దర్యాప్తు, పురోగతి, సిబ్బంది విధుల నిర్వహణ, గస్తీ వ్యవస్థ, ప్రజా ఫిర్యాదుల పరిష్కార విధానం, అత్యవసర డయల్ 100 కాల్స్ స్పందన, బాధితుల ఇంటి వద్దకే వెళ్లి కేసుల నమోదు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. జిల్లాలో అమలు చేస్తున్న ఉత్తమ పోలీసింగ్ విధానాలను సమగ్రంగా తెలియజేశారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్పీతో పాటు ఏఆర్ అదనపు ఎస్పీ వీరారెడ్డి, సీఐలు రత్నం, రాంబాబు, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, జిల్లా పోలీసు కార్యాలయ సూపరింటెండెంట్లు ఇంతియాజ్, రాజవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.


