దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

దరఖాస్తుల ఆహ్వానం

Jul 4 2026 12:26 AM | Updated on Jul 4 2026 12:26 AM

వనపర్తి: రాష్ట్రంలోని క్రైస్తవ మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి పథకాలకు శనివారం నుంచి 18వ తేదీ వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి ముజాహిద్‌ఖాన్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కుట్టుమిషన్లు, చిరు వ్యాపారాలకు 21 ఏళ్ల నుంచి 55 ఏళ్లలోపు.. ఈ–బైక్‌, ఈ–స్కూటీ, మోటార్‌బైక్‌ యూనిట్లకు 21 ఏళ్ల నుంచి 50 ఏళ్లలోపు వారు అర్హులని పేర్కొన్నారు. వార్షిక కుటుంబ ఆదాయం పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు మించరాదని.. ఆసక్తి, అర్హల కలిగిన వారు tso bmms.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకొని ప్రతులను జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి కార్యాలయంలో సమర్పించా లని సూచించారు. మరిన్ని వివరాలకు ఫోన్‌న ంబర్‌ 040–23391067 సంప్రదించాలన్నారు.

ప్రీ మెట్రిక్‌ ఉపకార వేతనాలకు..

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10వ తరగతి చదువుతున్న బీసీ విద్యార్థులు 2025–26, 2026–27 విద్యాసంవత్సరానికిగాను ప్రీ మెట్రిక్‌ ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధిశాఖ అధికారి మజూహీద్‌ఖాన్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన విద్యార్థులకు ఏడాదికి రూ.4 వేల ఉపకార వేతనం అందజేస్తామని.. విద్యార్థులు గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి ఎస్‌ఎస్‌పీ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని ఆధార్‌ ఫేస్‌ ఐడి ద్వారా 14 అంకెల ఓటీఆర్‌ నంబర్‌ను పొందాలని సూచించారు. అనంతరం మీ సేవా కేంద్రాల్లో ఈ–పాస్‌ వెబ్‌సైట్‌లో ఫ్రెష్‌ లేదా రెన్యూవల్‌ దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తుతో పాటు పాస్‌పోర్ట్‌సైజ్‌ ఫొటో, ఆధార్‌కార్డు, బ్యాంక్‌ పాస్‌బుక్‌, కుల, ఆదాయ, విద్యార్హత ధ్రువపత్రాలు జత చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

రెండోరోజు..

రెండు నామినేషన్లు

అమరచింత: చేనేత సహకార సంఘం ఎన్నికల నామినేషన్ల స్వీకరణ రెండోరోజు శుక్రవారం ఇద్దరు నామినేషన్‌ దాఖలు చేశారని రిటర్నింగ్‌ అధికారి ప్రసాదరావు తెలిపారు. శనివారం నామినేషన్ల స్వీకరణ గడువు ముగుస్తుందని.. చివరిరోజు 9 డైరెక్టర్‌ స్థానాలకుగాను అత్యధికంగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉందన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ నెల 10న ఎన్నికలు జరగనున్నాయి.

జాతీయ మీడియా

సదస్సుకు డీపీఆర్వోలు

నారాయణపేట: జిల్లా పౌర సంబంధాల అధికారి (డీపీఆర్వో) ఎంఏ రషీద్‌, వనపర్తి డీపీఆర్వో సీతారాం ఢిల్లీలో శుక్రవారం జరిగిన మీడియా కమ్యూనికేషన్‌ అధికారుల జాతీయ సదస్సుకు హాజరయ్యారు. జాతీయ సదస్సుకు తెలంగాణ నుంచి ఎంపికై న కొద్దిమంది అధికారుల్లో ఇరు జిల్లాల అధికారులు ఉన్నారు. ఎన్నికల సమాచార వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించడంలో సదస్సు అనుభవాలు ఎంతో ఉపయోగపడుతాయని అధికారులు పేర్కొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement