మళ్లీ వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే | - | Sakshi
Sakshi News home page

మళ్లీ వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే

Jul 3 2026 12:23 AM | Updated on Jul 3 2026 12:23 AM

కల్వకుర్తి రూరల్‌: రాష్ట్రంలో ప్రతి గడపకూ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని.. వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ ప్రభుత్వం రావడం ఖాయమని నాగర్‌కర్నూల్‌ ఎంపీ డా.మల్లురవి ధీమా వ్యక్తం చేశారు. గురువారం కల్వకుర్తిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అధ్యక్షతన ప్రజాపాలన – ప్రగతి నివేదిక, మహనీయుల జాతర ముగింపు సమావేశం నిర్వహించగా.. ఎంపీతో పాటు ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, జి.మధుసూదన్‌రెడ్డి, వీర్లపల్లి శంకర్‌, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మల్లురవి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన రెండున్నరేళ్ల కాలంలోనే ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేశామన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement