భూ తగాదాలు కోర్టుల్లో పరిష్కరించుకోవాలి.. | - | Sakshi
Sakshi News home page

భూ తగాదాలు కోర్టుల్లో పరిష్కరించుకోవాలి..

Jun 30 2026 3:23 AM | Updated on Jun 30 2026 3:23 AM

వనపర్తి: భూ వివాదాలను న్యాయస్థానాల్లోనే పరిష్కరించుకోవాలని ఎస్పీ సునీతారెడ్డి అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి వివిధ ప్రాంతాలకు చెందిన అర్జీదారులు వచ్చి ఎస్పీని కలిసి వినతులు అందజేశారు. ఎస్పీ వాటిని నిషితంగా పరిశీలించి వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకొని సంబంధిత పోలీస్‌స్టేషన్‌ అధికారులకు ఫోన్‌చేసి తక్షణమే పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. ప్రజా సమస్యలకు చట్టబద్ధమైన పరిష్కారం చూపించడం పోలీసుశాఖ బాధ్యతన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే సమస్యలు తలెత్తినప్పుడు వెంటనే పోలీసులను ఆశ్రయించాలని సూచించారు. పోలీసు ప్రజావాణికి మొత్తం 22 వినతు లు వచ్చినట్లు కార్యాలయ సిబ్బంది తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement