మోగిన చేనేత ఎన్నికల నగరా | - | Sakshi
Sakshi News home page

మోగిన చేనేత ఎన్నికల నగరా

Jun 30 2026 3:23 AM | Updated on Jun 30 2026 3:23 AM

అమరచింత: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చేనేత సహకార సంఘాల ఎన్నికల నోటిఫికేషన్‌ సోమవారం వెలువడింది. రిటర్నింగ్‌ అధికారులు చేనేత కార్మికుల సమక్షంలో విడుదల చేశారు. అమరచింత చేనేత సహకార సంఘంలో చేనేత సహకార సంఘం మాజీ అధ్యక్షుడు మహంకాళి చంద్రమోహన్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రిటర్నింగ్‌ అధికారి ప్రకాశ్‌రావు ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూలై 2 నుంచి 4వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తామని, 5వ తేదీన పరిశీలన, 6న ఉపసంహరణ అనంతరం గుర్తులను కేటాయించనున్నట్లు చెప్పారు. 10వ తేదీన ఉదయం పోలింగ్‌.. మధ్యాహ్నం తర్వాత ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తామని వివరించారు. మూడురోజుల తర్వాత అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ప్రతి సంఘంలో 9 మంది డైరెక్టర్లు ఉండగా.. అందులో ఇద్దరు మహిళలు తప్పనిసరి అని తెలిపారు. నామినేషన్‌ ఫీజు బీసీ సర్టిఫికేట్‌ సమర్పిస్తే రూ.750, సర్టిఫికేట్‌ లేకుంటే రూ.వెయ్యి.. ఎస్టీ, ఎస్సీలకు రూ.250 ఉంటుందన్నారు.

మొదలైన ఎన్నికల వేడి..

చేనేత సహకార సంఘాల ఎన్నికలకు నోటిఫికేషన్‌ వెలువడటంతో ఆయా చేనేత సొసైటీలలో ఎన్నికల వేడి మొదలైంది. సభ్యులు అధికంగా ఉన్న సొసైటీల్లో మాజీ పాలకవర్గం మరోమారు కై వసం చేసుకునేందుకు నేతన్నల ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారు.

మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం

పాన్‌గల్‌: పేద విద్యార్థుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్‌ గోవర్ధన్‌సాగర్‌ అన్నారు. సోమవారం మండలంలోని మాందాపూర్‌ ప్రాథమిక పాఠశాలలో ఉపాధిహామీ నిధులు రూ.3.40 లక్షలతో నిర్మించిన కిచెన్‌ షెడ్‌ను ఆయన సర్పంచ్‌ సుగుణమ్మతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చదివించాలని సూచించారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి ఆనంద్‌, మాజీ సర్పంచ్‌ జయరాములుసాగర్‌, కృష్ణయ్యసాగర్‌, ఉప సర్పంచ్‌ శ్యాంసుందర్‌గౌడ్‌, పంచాయతీ కార్యదర్శి ఆంజనేయులు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement