రిజర్వేషన్లతోనే గిరిజనుల అభ్యున్నతి | - | Sakshi
Sakshi News home page

రిజర్వేషన్లతోనే గిరిజనుల అభ్యున్నతి

Jun 28 2026 7:42 AM | Updated on Jun 28 2026 7:42 AM

పాన్‌గల్‌/వనపర్తి: కాంగ్రెస్‌ ప్రభుత్వం 1976లో గిరిజనులకు రిజర్వేషన్లు కల్పించడంతో అభ్యున్నతి సాధ్యమైందని.. ఇప్పటికీ వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి కృషి చేస్తోందని కాంగ్రెస్‌పార్టీయేనని ఎంపీ బలరాంనాయక్‌ అన్నారు. శనివారం లంబాడి, ఎరుకల, యానాది కులాల ఎస్టీ రిజర్వేషన్‌ 50 ఏళ్ల స్వర్ణోత్సవ బస్సుయాత్ర జిల్లాకేంద్రంతో పాటు పాన్‌గల్‌ మండలం తెల్లరాళ్లపల్లితండాకు చేరుకోవడంతో పార్టీ శ్రేణులు, తండావాసులు ఘన స్వాగతం పలికారు. జిల్లాకేంద్రంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు, శాట్‌ చైర్మన్‌ శివసేనారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ఎంపీ మాట్లాడుతూ.. నాడు ఇందిరమ్మ కేటాయించిన రిజర్వేషన్ల ఫలాలతో గిరిజనులు పార్లమెంట్‌ వరకు, కిందిస్థాయి నుంచి కలెక్టర్‌ దాకా ఎదిగారన్నారు. సెప్టెంబర్‌లో హైదరాబాద్‌లో ఆశీర్వాద సభ ఉంటుందని.. లక్షలాది మంది గిరిజనులు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో గిరిజనులు అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతున్నారన్నారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ హయాంలోనే తండాల అభివృద్ధి జరిగిందని, రెండున్నరేళ్లలో వనపర్తి నియోజకవర్గంలోని తండాల అభివృద్ధికి రూ.45 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రతి తండాలో సేవాలాల్‌ ఆలయ నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. డీసీసీ అధ్యక్షుడు మాట్లాడుతూ.. గిరిజనుల సామాజిక, రాజకీయ సాధికారతకు పునాది వేసింది కాంగ్రెస్‌పార్టీ అన్నారు. గిరిజనులకు ఎస్టీ రిజర్వేషన్లు కల్పించి వారి అభ్యున్నతికి మార్గం సుగమం చేసిన నాయకురాలు ఇందిరాగాంధీ అని.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమమే కాంగ్రెస్‌పార్టీ లక్ష్యమన్నారు. బస్సుయాత్రలో దేవరకొండ ఎమ్మెల్యే బాలూనాయక్‌, ప్రభుత్వ విప్‌ రామచందర్‌నాయక్‌, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్‌, మాజీ మంత్రి రవీందర్‌నాయక్‌, మాజీ ఎమ్మెల్యే రాములునాయక్‌, టైకార్‌ చైర్మన్‌ బెల్లయ్యనాయక్‌ ఉన్నారు. వనపర్తిలో జరిగిన కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ శ్రీనివాస్‌గౌడ్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మాధవి, పెబ్బేరు మున్సిపల్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌గౌడ్‌, కాంగ్రెస్‌పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు తిరుపతయ్య, ప్రధానకార్యదర్శి బ్రహ్మచారి, మాజీ ఎంపీపీ శంకర్‌నాయక్‌, తెల్లరాళ్లపల్లి తండాలో జరిగిన కార్యక్రమంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు హన్మంతునాయక్‌, గిరిజన సంఘం జిల్లా నాయకులు బాల్యానాయక్‌, మాజీ సర్పంచ్‌ రాజునాయక్‌ పాల్గొన్నారు.

ఎంపీ బలరాంనాయక్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement