కాంగ్రెస్‌తోనే పేదల కల సాకారం : ఎమ్మెల్యే | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌తోనే పేదల కల సాకారం : ఎమ్మెల్యే

Jun 26 2026 7:27 AM | Updated on Jun 26 2026 7:27 AM

వనపర్తి రూరల్‌: కాంగ్రెస్‌పార్టీ ఆవిర్భావం నుంచి పేదల సంక్షేమానికి కృషి చేస్తోందని.. ప్రజా ప్రభుత్వంలో పేదల సొంతింటి కల సాకారమవుతోందని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. గురువారం పెబ్బేరు మండలం రాంపురం గ్రామంలో జరిగిన 10 మంది ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుల గృహ ప్రవేశాలకు ఆయన హాజరై కొత్త దుస్తులు అందించి శుభాకాంక్షలు తెలిపారు. తమ సొంతింటి కల నెరవేర్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యేకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం గ్రామంలో కొత్తగా నిర్మించిన జములమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్టలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో నిర్వహించే గ్రామ దేవతల ఉత్సవాలు ప్రజల మధ్య ఐక్యతను చాటుతాయన్నారు. అనంతరం పెబ్బేరు 12 వార్డులో రూ.7.50 లక్షలు ఎస్‌డీఎఫ్‌ నిధులతో నిర్మించిన చిన్న పీర్ల చావిడిని పుర చైర్మన్‌ అక్కి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి ప్రారంభించారు. ఎన్నికల సమయంలో స్థానిక ప్రజలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవడం ఆనందంగా ఉందన్నారు. పీర్ల పండుగతో పాటు స్థానిక సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు చావిడి ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నామని.. రాబోయే రోజుల్లో మరిన్ని నిధులతో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మార్కెట్‌ చైర్మన్‌ గౌని ప్రమోదిని, వైస్‌ చైర్మన్‌ ఎద్దుల విజయవర్ధన్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ సుమిత్ర, కౌన్సిలర్‌ సౌజన్య, కౌన్సిలర్లు జములమ్మ, పర్వీన్‌, పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు దయాకర్‌రెడ్డి, రాంరెడ్డి, నాయకులు సురేందర్‌గౌడ్‌, వెంకటేష్‌సాగర్‌, రామన్‌గౌడ్‌, షకీల్‌, రాములుయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

బీఎల్వోలకు సహకరించాలి..

కొత్తకోట రూరల్‌: అర్హులైన ప్రతి ఓటరు ఎన్యూమరేషన్‌ ఫారాన్ని సక్రమంగా పూరించి బీఎల్వోలకు అందజేయాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కోరారు. భారత ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌) కార్యక్రమంలో భాగంగా గురువారం పెద్దమందడి మండలం మంగంపల్లి గ్రామంలో బీఎల్వో ఎమ్మెల్యే నివాసానికి వెళ్లి ఎన్యూమరేషన్‌ ఫారాన్ని అందజేయగా స్వీకరించి మాట్లాడారు. ఓటరు జాబితాను మరింత పారదర్శకంగా, తప్పులు లేకుండా రూపొందించేందుకు ఎన్నికల సంఘం చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రజలు సహకరించాలన్నారు. కార్యక్రమంలో పెద్దమందడి తహసీల్దార్‌ మల్లికార్జున్‌, ఎన్నికల సిబ్బంది, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement