సర్‌.. విజయవంతం కావాలి | - | Sakshi
Sakshi News home page

సర్‌.. విజయవంతం కావాలి

Jun 26 2026 7:27 AM | Updated on Jun 26 2026 7:27 AM

ప్రతి ఓటరుకు ఎన్యూమరేషన్‌ ఫారం అందాలి

కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి

వనపర్తి: ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో భాగంగా ప్రతి ఓటరుకు ఎన్యూమరేషన్‌ ఫారం అందించడంతో పాటు ఓటర్ల సందేహాలను నివృత్తి చేస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి ఆదేశించారు. గురువారం వనపర్తి పుర పరిధిలోని ఆర్టీసీ కాలనీ, పెబ్బేరులోని రెండోవార్డులో కొనసాగుతున్న ఎన్యూమరేషన్‌ ఫారాల పంపిణీ, బీఎల్వోలు అవగాహన కల్పిస్తున్న తీరును కలెక్టర్‌ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూలై 1లోపు జిల్లాలో ఫారాల పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. ఫారాల పంపిణీ సమయంలో ఓటర్లకు వాటిని పూరించే విధానాన్ని కూడా వివరించాలన్నారు. అలాగే ఫారాల సేకరణ ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలని, బూత్‌స్థాయి ఏజెంట్లు కూడా బీఎల్వోలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. కలెక్టర్‌ వెంట ఆర్డీఓ సుబ్రమణ్యం, జెడ్పీ సీఈఓ యాదయ్య, పెబ్బేరు మార్కెట్‌యార్డ్‌ చైర్మన్‌ ప్రమోదిని, వైస్‌ చైర్మన్‌ విజయవర్ధన్‌రెడ్డి, తహసీల్దార్లు రమేష్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డి, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement