ఎకై ్సజ్‌ డీసీగా విజయ్‌భాస్కర్‌రెడ్డి | - | Sakshi
Sakshi News home page

ఎకై ్సజ్‌ డీసీగా విజయ్‌భాస్కర్‌రెడ్డి

Jun 26 2026 7:27 AM | Updated on Jun 26 2026 7:27 AM

వనపర్తి, గద్వాల, నాగర్‌కర్నూల్‌కు కొత్త ఈఎస్‌లు

మహబూబ్‌నగర్‌ క్రైం: ఉమ్మడి జిల్లాలో అబ్కారీ శాఖలో ఉన్నతాధికారులకు స్థానచలనం జరిగింది. మహబూబ్‌నగర్‌ జిల్లా అసిస్టెంట్‌ కమిషనర్‌గా ఉంటూ ఇన్‌చార్జి డీసీగా ఉన్న విజయ్‌భాస్కర్‌రెడ్డిని ఇక్కడే ఉమ్మడి జిల్లా రెగ్యులర్‌గా డిప్యూటీ కమిషనర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఖాళీ అయిన ఆ స్థానానికి హైదరాబాద్‌ నుంచి జి.శ్రీనివాస్‌ బదిలీపై ఉమ్మడి జిల్లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌గా వచ్చారు. నాగర్‌కర్నూల్‌ ఈఎస్‌గా పని చేస్తున్న గాయత్రి మెదక్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌గా బదిలీపై వెళ్లారు. ఆమె స్థానంలో నాగర్‌కర్నూల్‌ ఈఎస్‌గా వి.వేణుగోపాల్‌రెడ్డి ఖమ్మం నుంచి పదోన్నతిపై వచ్చారు. భూపాలపల్లి నుంచి వనపర్తి ఈఎస్‌గా ఎం.లింగచారి, కొత్తగూడెం ఏఈఎస్‌గా ఉన్న పి.కరమ్‌చంద్‌ పదోన్నతిపై గద్వాల ఈఎస్‌గా వచ్చారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఏఈఎస్‌గా ఉన్న నర్సింహారెడ్డి పదోన్నతిపై మెదక్‌ ఈఎస్‌గా వెళ్లారు.

ఉపాధ్యాయుడి సస్పెన్షన్‌

మాగనూర్‌: మండలంలోని గురువాలింగంపల్లి ప్రభుత్వ మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీగా విధులు నిర్వర్తిస్తున్న వినోద్‌కుమార్‌ను గురువారం సస్పెండ్‌ చేసినట్లు ఎంఈఓ గణేష్‌సింగ్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వినోద్‌కుమార్‌ నారాయణపేటకు చెందిన సింధు అనే యువతిని ప్రేమ పేరుతో వేధించడంతో ఆమె ఏప్రిల్‌ 21న బలవన్మరణానికి పాల్పడిందని.. సదరు యువతి కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పట్లో క్రిమినల్‌ కేసు నమోదు కావడంతో పాటు 48 గంటలు జ్యుడీషీయల్‌ కస్టడీలో ఉన్నారని చెప్పారు. దీంతో జిల్లా విద్యాధికారి గోవిందరా జు ఆదేశాల మేరకు వినోద్‌కుమార్‌ను గురువా రం సస్పెండ్‌ చేసినట్లు ఆయన వివరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement