ఎస్పీని కలిసిన డీటీఓ | - | Sakshi
Sakshi News home page

ఎస్పీని కలిసిన డీటీఓ

Jun 25 2026 5:59 AM | Updated on Jun 25 2026 5:59 AM

వనపర్తి: జిల్లా రవాణా అధికారి (డీటీఓ) సురేష్‌కుమార్‌ బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ సునీతారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్క అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజల ప్రాణరక్షణే పోలీసు, రవాణాశాఖల ప్రధాన బాధ్యతన్నారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని.. హెల్మెట్‌, సీట్‌బెల్ట్‌ వినియోగం, మద్యం తాగి వాహనాలు నడపకుండా ఉండటం, అధిక వేగాన్ని నియంత్రించడం వంటి అంశాలపై నిరంతరం ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. రెండు శాఖలు పరస్పర సహకారంతో పనిచేస్తే రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించగలుగుతామని తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement