కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీలు అమలు చేయిస్తాం | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీలు అమలు చేయిస్తాం

Mar 19 2026 10:31 AM | Updated on Mar 19 2026 10:31 AM

వనపర్తి రూరల్‌: కాంగ్రెస్‌ పార్టీ మెడలువంచి ఆరు గ్యారెంటీలు అమలు చేయిస్తామని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిరాజు పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ బుధవారం పట్టణ పార్టీ అధ్యక్షుడు రాజశేఖర్‌గౌడ్‌ ఆధ్వర్యంలో జిల్లా నాయకులతో కలసి, జిల్లా కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యలాయంలో డిప్యూటీ తహసీల్దార్‌కు చక్రపాణికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ గద్దెనెక్కి 27 నెలలైనా ఒక్క హామీకూడా అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను తీవ్రంగా మోసం చేసిందన్నారు. కార్యక్రమంలో నాయకులు ఆర్‌.వెంకటేశ్వర్‌రెడ్డి, కౌన్సిలర్లు విజయ్‌సాగర్‌, దాసరాజు ప్రవీణ్‌ కొమ్ము,శ్రీను, గోపినాథ్‌, కంచరవి, చాణక్య, ఉపేందర్‌ యాదవ్‌, చిన్నరాముడు తదితరులు పాల్గొన్నారు.

తాగునీటి సమస్య పరిష్కరించాలి

వనపర్తిటౌన్‌: గత వారం రోజులు 19వ, వార్డులో నీటి ఎద్దడి నెలకొందని, అధికారులు వెంటనే స్పందించి నీటి సరఫరా సమస్యను తీర్చాలని 19వవార్డు కౌన్సిలర్‌ మురళీసాగర్‌ కోరారు. ఈ మేరకు బుధవారం పుర కార్యాలయంలో కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. 19వవార్డులో ఎండలు తీవ్రతరమై నీటి సమస్యలు రాకముందే ముందస్తు చర్యలుగా సమస్యలను పరిష్కరించాలని పుర కమిషనర్‌ ఎన్‌.వెంకటేశ్వర్లు కోరారు. వేసవికాలంలో మంచి నీటిఎద్దడితో ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement