వనపర్తి రూరల్: మండలంలోని చిమనగుంటపల్లి గ్రామంలో ఆంబేద్కర్ నవచైతన్య సొసైటీ అధ్యక్షుడు భాస్కర్, బంజారా గిరిజన విద్యార్థి సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు శివనాయక్, స్వామి వివేకానందా యూత్ అధ్యక్షుడు వాకిటి మహేష్ ఆధ్వర్యంలో బుదవారం జ్యోతిరావుపూలే.. సావిత్రిబాయి పూలే విగ్రహాలకు భూమిపూజ చేశారు. కార్యక్రమంలో అంబేద్కర్ నగర్ సొసైటీ అధ్యక్షుడు భాస్కర్, నవ చైతన్య సొసైటీ వైస్ ప్రసిడెంట్ గొర్ల చంద్రకాంత్, జనరల్ సెక్రెటరీ జి.కృష్ణ, ట్రెజరర్ పుల్లయ్య, కె.బాలయ్య, స్వామి వివేకానందా గౌరవ అధ్యక్షుడు వాకిటి నిలేందర్, భగవంతు యాదవ్, వాకిటి సుదర్శన్, చెంచేటి మహేష్, రాజశేఖర్, వాకిటి నరేష్ పాల్గొన్నారు.


