చిన్నారికి అరుదైన వ్యాధి | - | Sakshi
Sakshi News home page

చిన్నారికి అరుదైన వ్యాధి

Mar 19 2026 10:31 AM | Updated on Mar 19 2026 10:31 AM

పాన్‌గల్‌: ఆడుతూ పాడుతూ సంతోషంగా గడపాల్సిన వయస్సులో అరుదైన స్వైన్‌ప్లూ వ్యాధితో పోరాడుతున్న ఓ చిన్నారి దీనగాథ ఇది. వివరాల్లోకి వెళ్తే.. వనపర్తి జిల్లా పాన్‌గల్‌ మండలం నిజామాబాద్‌ (మంగళ్లపల్లి)కి చెందిన వరలక్ష్మి, మద్దిలేటి కుటుంబం వ్యవసాయ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తోంది. వారి రెండో కుమారుడు రిషికేష్‌ (5) పదిరోజుల కిందట అనారోగ్యానికి గురికాగా జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స అందించినా ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోవడంతో అటు నుంచి హైదరాబాద్‌లోని రెయిన్‌బో ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అన్నిరకాల వైద్య పరీక్షలు నిర్వహించి అరుదైన స్వైన్‌ఫ్లూ వ్యాధి సోకినట్లు నిర్ధారించారు. ప్రత్యేక వైద్యం అవసరమని.. చికిత్సకు రూ.30 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలుపడంతో తమ కుమారుడిని ఎలా కాపాడుకోవాలో తెలియని అయోమయంలో పడిపోయారు. చికిత్సకు సీఎంఆర్‌ఎఫ్‌ ఎల్వోసీలు, ఆరోగ్యశ్రీ పథకాలు వర్తించవని వైద్యులు తెలిపినట్లు కుటుంబ సభ్యులు వివరించారు. రూ.5 లక్షలు అప్పుచేసి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. రోజుకు రూ.50 వేలకు పైగా ఖర్చవుతుందని.. దాతలు, సేవాసంస్థలు ముందుకొచ్చి ఆర్థిక సాయం అందించి తమ కుమారుడి ప్రాణాలు కాపాడాలని పేద కుటుంబం వేడుకుంటోంది. సాయం చేయాల్సిన దాతలు బాలుడి తల్లిదండ్రుల సెల్‌నంబర్లు 93986 68985, 93926 54657 సంప్రదించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

ఆంగ్ల నైపుణ్యాలు

మెరుగుపర్చుకోవాలి

వనపర్తిటౌన్‌: నేటి టెక్నాలజీతో విద్యార్థులు ఎన్నో ఆవిష్కరణలు చేయొచ్చని, విద్యార్థులు ఆంగ్లం నేర్చుకొని సాంకేతికతపై శ్రద్ధ పెడితే దేశం ప్రపంచంలో అభివృద్ధి దేశాలకు ధీటుగా పోటీ పడి నెగ్గుతుందని ఆంగ్ల ఉపన్యాసకుడు డాక్టర్‌. ఎండీ మహబూబ్‌ పాషా అన్నారు. ఈ మేరకు బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ (కో–ఎడ్‌) కళాశాలలో ఇంగ్లిస్‌ డిపార్ట్‌మెంట్‌ ఆధ్వర్యంలో ఎక్ట్సెన్షన్‌ లెక్చరర్‌ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. ఆంగ్లభాష ప్రాముఖ్యతతో పాటు నేటి టెక్నాలజీ ప్రభావాన్ని విద్యార్థులు పరిశీలించి ప్రపంచం ఎలా ముందుకెళ్తుందో గ్రహించాలన్నారు. ఏఐ ఆధారిత సాధనాలు విద్యార్థులకు వ్యక్తిగతంగా సహాయం చేస్తూ, వారి వ్యాకరణ దోషాలను సరిచేసి, సరైన వ్యాఖ్య నిర్మాణాన్ని నేర్పిస్తున్నాయన్నారు. అంతకుముందు ఉపన్యాసకుడు ఎండీ మహబూబ్‌ పాషాను కళాశాల ప్రిన్సిపాల్‌ రఘునందన్‌ శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో ఇంగ్లిష్‌ డిపార్ట్‌మెంట్‌ హెచ్‌వోడీ దామ్‌సింగ్‌, లెక్చరర్‌ మద్దిలేటి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

● చికిత్సకు రూ.30 లక్షలు

అవుతుందన్న వైద్యులు

● దాతల సాయానికి ఎదురుచూపులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement