పాఠశాలలో ఉగాది సంబురాలు | - | Sakshi
Sakshi News home page

పాఠశాలలో ఉగాది సంబురాలు

Mar 19 2026 10:31 AM | Updated on Mar 19 2026 10:31 AM

పాన్‌గల్‌: మండల కేంద్రం ప్రాథమిక పాఠశాలల్లో బుధవారం ఉగాది పండుగ సంబురాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయ బృందం ఉగాది పచ్చడిని తయారు చేసి విద్యార్థులకు పంపిణీ చేశారు. జీవితంలో కష్టసుఖాలు సమానంగా స్వీకరించాలనే సందేశాన్ని, ఆరోగ్య ప్రయోజనాలను సూచిస్తాయన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ ఆనంద్‌, హెచ్‌ఎం పద్మ, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

మత్తు పదార్థాల వినియోగం హానికరం

కొత్తకోట రూరల్‌: మత్తు పదార్థాల వినియోగం హానికరమని.. జీవితాలు నాశనం అవుతాయని కొత్తకోట ఎకై ్సజ్‌ సీఐ కరుణ అన్నారు. బుధవారం మండలంలోని రాయినిపేటలో మత్తు పదార్థాల నివారణపై ఎకై ్సజ్‌ ఎస్సైలతో కలిసి గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, మత్తు పదార్థాల విక్రయం, వినియోగం చట్టపరంగా నేరమని, అలాంటి కార్యకలాపాలు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే ఎకై ్సజ్‌ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రజల సహకారం ఉంటేనే మత్తు నిర్మూలన సాధ్యమవుతుందన్నారు. అలాగే తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో మత్తు పదార్థాలపై నియంత్రణ సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో గ్రామపెద్దలు భాస్కర్‌రెడ్డితో పాటు గ్రామస్తులు, యువకులు, ఎకై ్సజ్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement