జిల్లాలో ప్రతిభకు కొదవలేదు | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో ప్రతిభకు కొదవలేదు

Mar 19 2026 10:31 AM | Updated on Mar 19 2026 10:31 AM

వనపర్తిటౌన్‌: జిల్లాలో ప్రతిభకు కొదవ లేదని.. ప్రతి ఒక్కరిలో ఓ మేధావి దాగి ఉన్నాడని హెచ్‌ఎండీఏ జనరల్‌ మేనేజర్‌ పెరవలి బద్రీనాథ్‌ అన్నారు. ప్రతిభను గుర్తించి వెలికితీసేందుకు సహకరిస్తే ప్రయోజకులవుతారని చెప్పారు. బుధవారం జిల్లాకేంద్రంలోని పానుగంటి శారదమ్మ బ్రాహ్మణ సంస్కారభవన్‌లో జిల్లా బ్రాహ్మణ పరిషత్‌ ఆధ్వర్యంలో పంచాంగం ఆవిష్కరించారు. అలాగే జిల్లాలో వివిధ రంగాల్లో అత్యంత ప్రతిభ కనబర్చిన 28 మందికి ఉగాది పురస్కారాలు అందజేసి సన్మానించారు. పురస్కారాలు అందుకున్న వారిలో.. కొత్తకోటకు చెందిన గ్రూప్‌–1 అధికారి పెరవలి బద్రీనాథ్‌, సినీ రచయిత్రి పోల్కంపల్లి శాంతాదేవి, ఆత్మకూర్‌కు చెందిన కవి, రచయిత బాబు దేవిదాస్‌రావు, కొత్తకోట మండలం కనిమెట్టకు చెందిన సినిమా డైరెక్టర్‌, సీనియర్‌ జర్నలిస్ట్‌ మద్దాలి వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీపీలు గోపాల్‌పేటకు చెందిన రామేశ్వరశర్మ, ఖిల్లాఘనపురానికి చెందిన శేషాచార్యులు, వనపర్తికి చెందిన ఓరుగంటి మనోహర్‌శర్మ, వంగీపురం నీరజాదేవి, తాళాల రమాకాంత్‌, తాళాల గాయత్రి, ప్రధానోపాధ్యాయురాలు పెరవలి గాయత్రి, గోశాల వ్యవస్థాపకుడు సౌమిత్రి రామాచారి, వనపర్తి వెంకటేశ్వరస్వామి ఆలయ చైర్మన్‌ అయ్యలూరి రఘునాథచార్యులు, వనపర్తి బ్రాహ్మణ భవన్‌ స్థలదాత రాంకిషన్‌రావు, పత్రి సుధాకర్‌శర్మ, ఆత్మకూర్‌కు చెందిన రాఘవన్‌, శంకరమ్మపేట సర్పంచ్‌ శ్రీనివాస్‌శర్మ, సీనియర్‌ రాజకీయ విశ్లేషకుడు దేవరాజు అచ్యుత రామారావు, టెలికంశాఖ మాజీ అధికారి తాటిపర్తి మోహన్‌రావు, నాయకంటి నరసింహశర్మ, గీసుకొండ శ్రీనివాసశర్మ, పెబ్బేరుకు చెందిన రంగాచార్యులు, అయ్యవారిపల్లికి చెందిన కృష్ణమాచార్యులు, మదనాపురం జ్యోషి శ్రీనివాసాచారి, సోళీపురానికి చెందిన వెంకటేశ్వరశర్మ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు మదనాపురం గోపీస్వామి, రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ మాజీ డైరెక్టర్‌ జ్యోషి గోపాలశర్మ, పంచాంగకర్త మనోహర సిద్ధాంతి, ధీరజ్‌శర్మ, పల్లా సాయికుమార్‌శర్మ, వరప్రసాదరావు, పత్రి సుధాకర్‌శర్మ, భక్షి శ్రీధర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement