హామీలన్నీ నెరవేరుస్తాం | - | Sakshi
Sakshi News home page

హామీలన్నీ నెరవేరుస్తాం

Mar 16 2026 8:54 AM | Updated on Mar 16 2026 8:54 AM

వీపనగండ్ల: అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్ఛయంతో ఉందని జిల్లా పర్యాటకశాఖ అధికారి నర్సింహ అన్నారు. ఆదివారం మండలంలోని కల్వరాలలో సీసీ రహదారి నిర్మాణానికి భూమిపూజ చేసి పనులు ప్రారంభించి మాట్లాడారు. ఉపాధిహామీ నిధులు రూ.16.50 లక్షలతో గ్రామంలో సీసీ రహదారి పనులు చేపడుతున్నామని.. మండలంలోని వివిధ గ్రామాల్లో కూడా మంత్రి జూపల్లి కృష్ణారావు సహకారంతో సీసీ రోడ్ల నిర్మాణాలకు ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులు మంజూరయ్యాయని చెప్పారు. రహదారి నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ బండారి రాములు, ఉపసర్పంచ్‌ తడకల రంగమ్మ, వార్డు సభ్యులు చింతల రవికుమార్‌, శ్రీకాంత్‌, ఆంజనేయులు, సాయిప్రసాద్‌, మల్లేష్‌, వెంకటయ్య, పార్టీ సీనియర్‌ నాయకులు వెంకటరాజయ్య, అఖిల్‌పాషా, మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.

చిరు వ్యాపారులు, ఆర్టీసీ అధికారుల వాగ్వాదం

వనపర్తి టౌన్‌: జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలో ఆదివారం చిరు వ్యాపారులు, ఆర్టీసీ అధికారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బస్టాండ్‌లోకి బస్సులు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆర్టీసీ సిబ్బంది కేసీ శెట్టి, కృష్ణయ్య, మహ్మద్‌ జాన్‌రాజ్‌ తదితరులు రహదారి పక్కన ఉన్న కూరగాయలు, పండ్ల విక్రయ దుకాణాలను తొలగించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో చిరు వ్యాపారులు అడ్డుకోవడంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. బస్సుల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయని, ఖాళీ చేయాలని వారం రోజులుగా చెబుతున్నా వినిపించుకోవడం లేదని.. చివరకు చేసేది లేక తొలగించాల్సి వచ్చిందని ఆర్టీసీ సిబ్బంది తెలిపారు. చిరు వ్యాపారులకు కౌన్సిలర్లు ఏర్పుల రవి, మాజీ ఎంపీపీ పద్మమ్మ మద్దతుగా నిలిచి అధికారులతో వాదనకు దిగారు. ఒకదశలో ఆర్టీసీ సిబ్బంది రోడ్డుపై కూరగాయలు పారబోయడం, వ్యాపారులు ఆందోళన దిగడంతో బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి.

‘పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి’

వనపర్తి రూరల్‌: పట్టణాన్ని స్వచ్ఛంగా తీర్చిదిద్దే పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని పెబ్బేరు పుర చైర్మన్‌ అక్కి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. ఆదివారం పెబ్బేరు పుర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ సుమిత్రాఎల్లారెడ్డి, కౌన్సిలర్లతో కలిసి కార్మికులకు ప్రభుత్వం తరఫున నూనెలు, సబ్బులు పంపిణీ చేసి మాట్లాడారు. నిత్యం ప్రజల ఆరోగ్యం కోసం పనిచేస్తున్న కార్మికులకు నూనెలు, సబ్బులే కాకుండా వారికి అవసరమయ్యే గ్లౌజులు, బూట్లు కూడా క్రమం తప్పకుండా అందజేస్తామని చెప్పారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు జమ్ములమ్మ, భాగ్యలక్ష్మి, పర్వీన్‌, హరిశంకర్‌నాయుడు, మన్యం, శివ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement