చిన్నంబావి: రైతు సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర ఎకై ్సజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం మండలంలోని కొప్పునూరులో సింగిల్‌విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పప్పుశనగ కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. రైతులు పండించిన పప్పుశనగ పంటను ప్రభుత్వ మద్దతు ధర క్వింటా రూ.5,875కు కొనుగోలు చేస్తామని తెలిపారు. కొనుగోళ్లలో నాణ్యతా ప్రమాణాలు పాటించడం ముఖ్యమని.. తేమశాతం 14 శాతంలోపే ఉండేలా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియ సజావుగా, వేగవంతంగా నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌పార్టీ సీనియర్ నాయకులు రామచంద్రారెడ్డి, బీచుపల్లి యాదవ్, విద్యాసాగర్‌రావు, చిదంబర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్, తేజారెడ్డి, సర్పంచ్ బిచ్చన్న, భాస్కర్, గూడెం సుధాకర్, జ్యోతిగౌడ్, రాజుకుమార్, ఉమేష్ నాయుడు, యువజన కాంగ్రెస్ నాయకులు విభీషణ్, కత్తి జాని తదితరులు పాల్గొన్నారు.


