‘పేదలను పట్టించుకోని బీఆర్‌ఎస్‌’ | - | Sakshi
Sakshi News home page

‘పేదలను పట్టించుకోని బీఆర్‌ఎస్‌’

Mar 16 2026 8:54 AM | Updated on Mar 16 2026 8:54 AM

గోపాల్‌పేట: బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పేదలను పట్టించుకోలేదని.. పేదలకు డబుల్‌బెడ్‌రూం ఇళ్లు, భూములు పంపిణీ చేస్తామని మోసం చేసిందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఆరోపించారు. ఆదివారం ఆయన మండలంలోని ఏదుట్ల, తాడిపర్తి, పొలికెపాడులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు ఇచ్చిన మాట ప్రకారం కొత్త దుస్తులు అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల పథకంతో తమ సొంతింటి కల సాకారమైందని, నిర్మాణాలు పూర్తి చేసుకున్నందుకు సంతోషంగా ఉందని చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పేదల పార్టీ అని, వారి ఇబ్బందులు తొలగించేందుకు ప్రభుత్వం నిబద్ధతతో పని చేస్తోందని చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తోందని, మహిళలకు వడ్డీలేని రుణాలు, ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచితం విద్యుత్‌ తదితర ఎన్నో పథకాలు అమలు చేస్తోందని వివరించారు. భవిష్యత్‌లో మరిన్ని పథకాలు అమలు చేయనున్నట్లు చెప్పారు. అనంతరం పొలికెపాడులో ప్రాథమిక ఉపకేంద్రాన్ని ప్రారంభించడంతోపాటు అంగన్‌వాడీ కేంద్రం భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఆయన వెంట మండల నాయకులు సత్యశిలారెడ్డి, తాడిపర్తి సర్పంచ్‌ లోకారెడ్డి, పొలికెపాడు సర్పంచ్‌ బంగారయ్య, ఆయా గ్రామాల ముఖ్య నాయకులు ఉన్నారు.

కాంగ్రెస్‌లో చేరిక..

మండలంలోని పొలికెపాడు సర్పంచ్‌ బంగారయ్య, ఉపసర్పంచ్‌ జంపన్నతో పాటు మరో 60 మంది కాంగ్రెస్‌పార్టీలో చేరగా ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథ కాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement