వనపర్తి విద్యావిభాగం: జిల్లాలోని కోర్టుల్లో ఈ నెల 28న నిర్వహించే జాతీయ లోక్‌అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ న్యాయమూర్తి వి.రజని కోరారు. గురువారం జిల్లాకేంద్రంలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో ప్యానల్ లాయర్లు, ఇన్సూరెన్స్ స్టాండింగ్ కౌన్సిల్స్, పిటిషనర్ అడ్వొకేట్లతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. లోక్ అదాలత్‌లో పరిష్కారమయ్యే కేసుల్లోని కక్షిదారులతో మాట్లాడి రాజీ కుదిర్చేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ న్యాయమూర్తి కళార్చన, అడిషనల్ సీనియర్ సివిల్ న్యాయమూర్తి కవిత, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి కార్తీక్‌రెడ్డి, ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి శ్రీలత, సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి నాగ అశ్విని పాల్గొన్నారు.


