ఆధునిక సాగుతోనే అధిక లాభాలు | - | Sakshi
Sakshi News home page

ఆధునిక సాగుతోనే అధిక లాభాలు

Mar 13 2026 9:01 AM | Updated on Mar 13 2026 9:01 AM

మదనాపురం: రైతులు మూస పద్ధతికి స్వస్తి పలికి శాస్త్రవేత్తల సూచనల మేరకు ఆధునిక సాంకేతికతను జోడించి పంటలు సాగు చేపట్టినప్పుడే వ్యవసాయం లాభసాటిగా మారుతుందని జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు అన్నారు. గురువారం మండల కేంద్రంలోని రైతువేదికలో నిర్వహించిన రైతులు, శాస్త్రవేత్తల ముఖాముఖి కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఆయనతో పాటు కేవీకే శాస్త్రవేత్త రాజేందర్‌రెడ్డి, సహాయ వ్యవసాయ సంచాలకుడు దామోదర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతులకు పలు కీలక అంశాలపై అవగాహన కల్పించారు. వ్యవసాయంలో ‘ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింక్స్‌’ ప్రాధాన్యం వివరిస్తూ నీటి పారుదలలో మెళకువలు పాటించాలని సూచించారు. వరికి బదులుగా మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న, దీర్ఘకాలిక ఆదాయాన్నిచ్చే ఆయిల్‌పాం వంటి పంటలు సాగు చేయాలని సూచించారు. వరి గడ్డిని తగులబెట్టడంతో కలిగే నష్టాలను వివరిస్తూ పచ్చిరొట్ట ఎరువుల వినియోగం, సేంద్రియ సాగు చేపట్టాలని ప్రోత్సహించారు. రాబోయే వానాకాలం సీజన్‌కు అనుకూలమైన విత్తన రకాల గురించి శాస్త్రవేత్తలు వివరించారు. ప్రతి మంగళవారం నిర్వహించే ‘రైతునేస్తం‘ కార్యక్రమానికి రైతులు విధిగా హాజరుకావాలని.. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, నూతన సాగు పద్ధతుల గురించి తెలుసుకునేందుకు ఇది మంచి వేదికని అన్నారు. కార్యక్రమంలో ఏఓలు గాయత్రి, అరవింద్‌, ఏఈఓలు, ఆత్మకూర్‌, అమరచింత, మదనాపురం, కొత్తకోట మండలాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement