ఉద్యోగరీత్యా రోజు దుప్పల్లి పాఠశాలకు వెళ్లాలి. బస్సులు మదనాపురం రైల్వేస్టేషన్ దగ్గరే నిలిపివేస్తున్నారు. దీంతో అక్కడే దిగి కిలోమీటర్ నడిచి ఆత్మకూర్ రోడ్ వద్ద ఆటోలో వెళ్లాల్సి వస్తోంది. రాకపోకలకు అదనపు భారం పడుతోంది. అధికారులు స్పందించి త్వరగా పనులు త్వరగా పూర్తిచేసి గేట్ తెరవాలి.
– ఆంజనేయులు, ఉపాధ్యాయుడు
పనుల్లో జాప్యం సరికాదు. గేటు మూసివేయడంతో వాగులో దుమ్ము, బురదలో వాహనం నడపాల్సి వస్తోంది. చాలామంది ద్విచక్ర వాహనదారులు గేట్ మూసి ఉన్నా అలాగే రైల్వే ట్రాక్ దాటిస్తున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు. మూడు రోజులు అని చెప్పి ఐదు రోజులైనా పూర్తి చేయడం లేదు.
– వంగూరు రామకృష్ణారెడ్డి,
బీజేపీ మండల అధ్యక్షుడు
సాంకేతిక కారణాలతో పనుల్లో కాస్త జాప్యం జరిగింది. ట్రాక్ వద్ద పనులు దాదాపు ముగింపు దశకు చేరుకున్నాయి. మరో రెండ్రోజుల్లో రాకపోకలు పునరుద్ధరిస్తాం. ప్రయాణికులకు కలిగిన ఇబ్బందికి చింతిస్తున్నాం. సోమవారం గేటు తెరిచే ప్రయత్నం చేస్తాం.
– రవికుమార్, రైల్వే సెక్షన్ ఇంజినీర్


