పీజీ హాస్టల్‌కు నిధులు మంజూరు | - | Sakshi
Sakshi News home page

పీజీ హాస్టల్‌కు నిధులు మంజూరు

Mar 12 2026 8:57 AM | Updated on Mar 12 2026 8:57 AM

వనపర్తి టౌన్‌: జిల్లాకేంద్రంలోని పీజీ కళాశాలలో చదివే విద్యార్థుల హాస్టల్‌ వసతికి నిధులు మంజూరైనట్లు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వైస్‌ ఛాన్స్‌లర్‌ విజ్ఞప్తి మేరకు 200 మంది మహిళలకు రూ.911.16 లక్షలు, 150 మంది పురుషులకు రూ.672.48 లక్షలు మంజూరయ్యాయని పేర్కొన్నారు.

‘ప్రజాపాలన’ శిక్షణకు పక్కా ఏర్పాట్లు

వనపర్తి: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జిల్లాకేంద్రంలో గురువారం నిర్వహించే సర్పంచ్‌లు, కౌన్సిలర్ల ఒకరోజు శిక్షణ కార్యక్రమానికి ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఎన్‌.ఖీమ్యానాయక్‌ అధికారులను ఆదేశించారు. శిక్షణ కార్యక్రమం కొనసాగే కళ్యాణసాయి గార్డెన్స్‌ను బుధవారం ఆయన పుర చైర్‌పర్సన్‌ మాధవి, జెడ్పీ సీఈఓ యాదయ్య, పుర కమిషనర్‌ వెంకటేశ్వర్లు, డీపీఓ రఘునాథ్‌రెడ్డి, తహసీల్దార్‌ రమేష్‌రెడ్డితో కలిసి సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని పురపాలికల చైర్మన్లు, వైస్‌ చైర్మలు, కౌన్సిలర్లు, సర్పంచులు శిక్షణకు హాజరవుతారని, ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. మంత్రులు, శాసనసభ్యులు, జిల్లా అధికారులు హాజరై వివరిస్తారని.. వచ్చే ప్రజాప్రతినిధులకు ఎలాంటి లోటు లేకుండా వేదిక, తాగునీరు, మధ్యాహ్న భోజనం, ఎల్‌ఈడీ స్క్రీన్లు, ఫొటో ఎగ్జిబిషన్‌ తదితర ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని సూచించారు.

తాగునీటి సరఫరాలో

ప్లంబర్లదే కీలకపాత్ర

ఆత్మకూర్‌: తాగునీటి సరఫరాలో ప్లంబర్లదే కీలకపాత్ర.. వారు లేకుంటే ప్రతి ఇంటికి తాగునీరు సకాలంలో చేరదని మిషన్‌ భగీరథ సీఈ లలిత అన్నారు. అంతర్జాతీయ ప్లంబర్ల దినోత్సవం సందర్భంగా బుధవారం మండలంలోని బాలకృష్ణాపూర్‌లో సర్పంచ్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించాలన్నారు. అనంతరం ఉత్తమ విధులు నిర్వర్తించిన వారిని సన్మానించారు. కార్యక్రమంలో ఎస్‌ఈ వెంకటరమణ, ఈఈ అంజాద్‌పాషా, ఎంపీడీఓ శ్రీపాద, ఎంపీఓ శ్రీరాంరెడ్డి, మిషన్‌ భగీరథ డీఈలు జయపాల్‌రెడ్డి, విజయ్‌కుమార్‌, ఏఈలు రుక్మేందర్‌రెడ్డి, మహే ష్‌, శివానంద్‌, మొగులయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement